Trisha: సూర్యకు సక్సెస్.. లక్కీ లేడీగా త్రిష.. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో హాట్ టాపిక్ గా హీరోయిన్
Trisha: ఇప్పుడు కోలీవుడ్ లో, తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిష కృష్ణన్. ఈ హీరోయిన్ ను లక్కీ లేడీ అని తెగ పొగిడేస్తున్నారు. తాజాగా కరుప్పుతో సూర్య సక్సెస్ అందుకోవడంతో త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది.
Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఆమె పేరే మార్మోగుతోంది. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో త్రిష వైరల్ గా మారింది. తాజాగా సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ మూవీ బక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

సూర్యకు సక్సెస్
2021లో వచ్చిన జై భీమ్ తర్వాత సూర్యకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన కంగువా, రెట్రో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంతో తాజాగా ‘కరుప్పు’తో సూర్య మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది.
త్రిష హీరోయిన్
థియేటర్లలో అదరగొడుతున్న కరుప్పులో త్రిషనే హీరోయిన్. ఈ మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయింది. ఇక్కడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిషను లక్కీ లేడి అని అంటున్నారు. సూర్యకు తిరిగి సక్సెస్ దక్కడంతో త్రిష పేరు మళ్లీ వైరల్ గా మారింది.
లక్కీ లేడీ
ఇప్పుడు త్రిషను లక్కీ లేడీ అని అంటున్నారు. తమిళనాడులో రాజకీయాల్లో, సినిమాల్లో ఆమె పేరే వినిపిస్తోంది. దళపతి విజయ్, త్రిషకు ఎఫైర్ ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీవీకే పార్టీ పెట్టి తొలిసారి పోటీపపడ్డ ఎన్నికల్లో సత్తాచాటిన విజయ్.. సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కరుప్పుతో సూర్యకు విజయం దక్కింది. దీంతో త్రిష లక్కీ లేడీ అని, ఆమె పక్కన ఉంటే విజయం ఖాయమనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
సీనియర్ హీరోయిన్
2002లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. వర్షం మూవీతో తెలుగు ఆడియన్స్ మది దోచుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశ, తీన్మార్ తదితర సినిమాల్లో నటించింది.
43 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభరలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీ. మలయాళంలో రామ్ అనే చిత్రంలోనూ నటించింది. ఇప్పుడు ఆమె లైనప్ లో మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో త్రిష పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


