OTT Trending: గ్లోబల్ రేంజ్ లో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- ట్రెండింగ్ నంబర్ వన్-మిస్ అవకుండా చూడాల్సిందే!

OTT Trending: ఓటీటీలో రీసెంట్ గా రిలీజైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ ఒరిజినల్ సిరీస్‌ల జాబితాలో ఈ సిరీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అసలు ఈ సిరీస్ ను ఎందుకు చూడాలో పూర్తి విశ్లేషణ ఇక్కడుంది.

Published on: Jun 20, 2026, 14:26:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Trending: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 12న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్, కేవలం కొద్ది రోజుల్లోనే రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

గ్లోబల్ రేంజ్ లో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- ట్రెండింగ్ నంబర్ వన్
గ్లోబల్ రేంజ్ లో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- ట్రెండింగ్ నంబర్ వన్

ఓటీటీ ట్రెండింగ్ లో టాప్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. జూన్ 8 నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్‌ల జాబితాలో (Top 10 Non-English Prime Original Series) ‘రాఖ్’ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జపాన్, జర్మనీ దేశాల పాపులర్ సిరీస్‌లను వెనక్కి నెట్టి మరీ భారతీయ కంటెంట్ ఈ ఘనత సాధించడం విశేషం.

‘రంగా-బిల్లా’ కేసు నేపథ్యంలో..

ప్రముఖ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్', 'పరీ' చిత్రాల దర్శకుడు ప్రోసిత్ రాయ్ ఈ రాఖ్ సిరీస్‌ను రూపొందించాడు. 1978లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'రంగా-బిల్లా' (గీతా చోప్రా, సంజయ్ చోప్రా కిడ్నాప్, హత్య) కేసు ఆధారంగా ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌ను నిర్మించారు.

రాఖ్ స్టోరీ

1970ల నాటి ఢిల్లీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ వెబ్ సిరీస్ కథ సాగుతుంది. ఒక ఆర్మీ అధికారుల కుటుంబానికి చెందిన ఇద్దరు టీనేజర్లు సుమన్, సాహిల్ అరోరా ఒక వర్షం కురుస్తున్న రాత్రి అకస్మాత్తుగా కిడ్నాప్‌నకు గురవుతారు. సమాజంలో ఎంతో గౌరవప్రదంగా బతికే ఆ కుటుంబం ఒక్కసారిగా తీరని శోకంలో మునిగిపోతుంది.

ఆ పిల్లలను వెతికే బాధ్యతను జయప్రకాష్ జాతవ్ (అలీ ఫజల్) అనే కొత్త సబ్-ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తారు. అటు వ్యవస్థలోని అవినీతి, కుల వివక్షను ఎదుర్కొంటూ, ఇటు సమాజంలో చాలా సాదాసీదాగా ఉంటూనే ఘోరమైన నేరాలకు పాల్పడే బాబు (ఆకాష్ మఖిజా), రజ్జో (రమణ్‌దీప్ యాదవ్) అనే ఇద్దరు హంతకులను జయప్రకాష్ ఎలా పట్టుకున్నాడు అనేదే ఈ సిరీస్ కథాంశం.

ఈ సిరీస్ ఎందుకు చూడాలి?

  • నిజ జీవిత సంఘటనల ఆధారంగా: భారతదేశ నేర చరిత్రలో అత్యంత క్రూరమైన సంఘటనగా నిలిచిన రంగా-బిల్లా కేసు గురించిన వాస్తవాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.
  • అలీ ఫజల్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్: 'మిర్జాపూర్' సిరీస్‌లో గుడ్డూ భయ్యాగా రౌడీ పాత్రలో అదరగొట్టిన అలీ ఫజల్, ఇందులో దానికి పూర్తి భిన్నంగా, ఎంతో సంయమనం కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటనను కనబరిచాడు.
  • సోనాలి బింద్రే ఎమోషనల్ కమ్ బ్యాక్: పిల్లలను కోల్పోయిన తల్లిగా సోనాలి బింద్రే పండించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తాయి. ముఖ్యంగా ఆమె క్లాస్‌రూమ్‌లో లెక్కలు చెప్పే ఒక సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కలచివేస్తుంది.
  • నేరస్థుల మనస్తత్వ విశ్లేషణ: ఈ సిరీస్‌లో విలన్లు ఎదో పెద్ద సూపర్ విలన్లుగా కాకుండా, మన పక్కనే తిరిగే సాధారణ వ్యక్తుల్లా కనిపిస్తూనే ఎంత ఘోరానికి ఒడిగట్టారో చూపించారు.

ఓటీటీ విడుదల వివరాలు

ఈ గ్రిప్పింగ్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా జూన్ 12, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

సిరీస్ పేరు: రాఖ్ (Raakh)

ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

విడుదల తేదీ: 12 జూన్, 2026

ఎపిసోడ్ల సంఖ్య: 8

ప్రధాన నటీనటులు: అలీ ఫజల్, సోనాలి బింద్రే, అమీర్ బషీర్, ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్, దిబ్యేందు భట్టాచార్య, రాకేష్ బేడీ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More