Thalapathy Vijay Birthday: దళపతి విజయ్ బర్త్ డే స్పెషల్.. ఓటీటీలో ఈ హీరో మస్ట్ వాచ్ టాప్ 5 సినిమాలు.. ఎందుకు చూడాలంటే?
Thalapathy Vijay Birthday: సినిమా హీరో నుంచి సీఎంగా ఎదిగిన దళపతి విజయ్ బర్త్ డే ఈ రోజు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఇందులో ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 మూవీస్ లిస్ట్ ఇక్కడుంది. ఈ చిత్రాలు ఎందుకు చూడాలో ఓ లుక్కేయండి.
Thalapathy Vijay Birthday: సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత థియేట్రికల్ రన్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం తన పేరుతోనే వందల కోట్ల బిజినెస్ చేయగల ఏకైక స్టార్ దళపతి విజయ్. అలాంటి స్టార్ డమ్ ను వదిలి, రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇవాళ (జూన్ 22) బర్త్ డే. ఈ సందర్భంగా ఓటీటీలోని ఆయన టాప్ 5 మూవీస్ ను చూసేయండి.

1. తుపాకీ (Thuppakki)
దళపతి విజయ్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే మూవీ తుపాకీ. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్ నెక్ట్స్, జియోహాట్ స్టార్ ఓటీటీల్లో ఉంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్.
ఎందుకు చూడాలి?
ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ‘జగదీష్’ పాత్రలో విజయ్ కెరీర్ బెస్ట్ స్టెలిష్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో స్లీపర్ సెల్స్‌ను వేటాడే ఈ కథలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ రాసుకున్న మైండ్ గేమ్‌లు, ప్రతి 20 నిమిషాలకు వచ్చే హై-వోల్టేజ్ ట్విస్టులు మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. విజయ్‌ను లోకల్ మాస్ హీరో నుంచి కంటెంట్ బేస్డ్ గ్లోబల్ స్టార్‌గా మార్చిన మైల్‌స్టోన్ చిత్రం ఇది.
2. కత్తి (Kaththi)
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేసిన కత్తి మూవీ కూడా స్పెషలే. ఇందులో ఆయన డ్యుయల్ రోల్ ప్లే చేశాడు. ఈ చిత్రం జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
ఎందుకు చూడాలి?
విజయ్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేసిన ఈ చిత్రం కార్పొరేట్ శక్తులు రైతుల భూములను ఎలా లాక్కుంటున్నాయనే సెన్సిటివ్ పాయింట్‌పై సాగుతుంది. ఇందులో విజయ్ చెప్పే క్లైమాక్స్ ప్రెస్ మీట్ స్పీచ్ ఇప్పటికీ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సోషల్ మోనోలాగ్‌గా నిలిచిపోయింది.
(గమనిక: తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెం.150' మూవీ విజయ్ కత్తికి అధికారిక రీమేక్)
3. మాస్టర్ (Master)
దళపతి విజయ్, విజయ్ సేతుపతి హై వోల్టేజీ యాక్షన్ థ్రిల్లర్ మాస్టర్. లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో భాగంగా వచ్చిన ఈ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందుకు చూడాలి?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ ఒక ఆల్కహాలిక్ ప్రొఫెసర్‌గా డిఫరెంట్ షేడ్‌లో కనిపిస్తారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. హీరో వర్సెస్ విలన్ డైనమిక్స్. విజయ్ సేతుపతి పోషించిన ‘భవాని’ క్యారెక్టర్‌కు, విజయ్ మాసిజానికి మధ్య జరిగే మైండ్ అండ్ ఫిజికల్ వార్, అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూనకాలు తెప్పిస్తాయి.
4. గిల్లి (Ghilli)
విజయ్, త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గిల్లి. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.
ఎందుకు చూడాలి?
మహేష్ బాబు క్లాసిక్ హిట్ 'ఒక్కడు' సినిమాకు రీమేక్ అయినప్పటికీ, విజయ్ తనదైన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రానికి కోలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ తెచ్చారు. విజయ్-త్రిష కెమిస్ట్రీ, ప్రకాష్ రాజ్ విలనిజం ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టించవు. 2024లో ఈ సినిమా రీ-రిలీజ్ అయి ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
5. లియో (Leo)
దళపతి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందుకు చూడాలి?
కాశ్మీర్‌లో ఒక సాధారణ కేఫ్ ఓనర్‌గా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఒక వ్యక్తి చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటి? అతని పాత జీవితం ఏంటి? అనేదే 'లియో' కథ. హాలీవుడ్ చిత్రం 'ఎ హిస్టరీ ఆఫ్ వయలెన్స్' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే అత్యంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. విజయ్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన బిగ్గెస్ట్ హిట్ ఇది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


