Jana Nayagan: దళపతి విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆ రోజేనా? సీఎం బర్త్ డేకు ముందు బ్లాస్ట్!

Jana Nayagan: దళపతి విజయ్ సినిమా జన నాయగన్ రిలీజ్ పై బిగ్ అప్ డేట్. ఈ మూవీ రిలీజ్ డేట్ పై బజ్ వైరల్ గా మారింది. సీఎం బర్త్ డే కు ముందు మూవీ బ్లాస్ట్ ప్లాన్ చేశారని టాక్. 

Published on: May 24, 2026, 21:05:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan: తమిళ సూపర్ స్టార్, సీఎం సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితమే విజయ్ కుటుంబ సభ్యులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన వెండితెరపై కనిపించబోయే చివరి సినిమా 'జన నాయగన్' రిలీజ్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.

జన నాయగన్ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్
జన నాయగన్ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్

జన నాయగన్ రిలీజ్ డేట్

దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ మూవీ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ వైరల్ గా మారింది. ఈ మూవీ జూన్ 19న రిలీజ్ కానుందని సమాచారం. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ సెన్సార్ వివాదాల కారణంగా థియేటర్లలోకి రాలేకపోయింది. జనవరిలోనే సినిమా విడుదల కావాల్సింది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) రివైజింగ్ కమిటీకి పంపడంతో అప్పటి నుంచి సెన్సార్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది.

బర్త్ డే కు ముందు బ్లాస్ట్

తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే జూన్ 22. ఈ సందర్భంగా జూన్ 19నే మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీబీఎఫ్ సీ ఈ మూవీకి యూ/ఏ 16 ప్లస్ సర్టిఫికేట్ కేటాయించిందని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం.

డిస్ట్రిక్ట్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ స్క్రీన్ షాట్
డిస్ట్రిక్ట్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ స్క్రీన్ షాట్

టికెటింగ్ వెబ్‌సైట్లలో

తాజాగా జన నాయగన్ సినిమా విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌లో జననాయగన్ విడుదల తేదీ జూన్ 19గా చూపిస్తోంది. మరో ప్రముఖ టికెటింగ్ పోర్టల్ 'బుక్ మై షో' (Book My Show) లో కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ జూన్ నెలలోనే ఉన్నట్లు అప్‌డేట్ చేశారు. ఈ అప్‌డేట్స్ చూసిన విజయ్ అభిమానులు థియేటర్లలో దళపతి చివరి వేటను చూసేందుకు సిద్ధమవుతున్నారు.

బుక్ మై షోలో జన నాయగన్ రిలీజ్ అప్ డేట్
బుక్ మై షోలో జన నాయగన్ రిలీజ్ అప్ డేట్

నిర్మాత ఏమన్నారంటే?

ఈ విడుదల తేదీలపై జన నాయగన్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, శుక్రవారం సాయంత్రం ఒక దేవాలయ దర్శనానికి వచ్చిన జన నాయగన్ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణను మీడియా ప్రతినిధులు పలకరించగా, ఆయన సెన్సార్, రిలీజ్ అప్‌డేట్‌పై స్పందించారు.

"ఇది జననాయగన్ గురించి మాట్లాడే స్థలం కాదు. నేను దేవుడి దర్శనం కోసం వచ్చాను. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లే, మేము సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్నాం. సెన్సార్ బోర్డ్ వారు ఎప్పుడైనా సర్టిఫికేట్ ఇవ్వవచ్చని నాకు నమ్మకం ఉంది. సర్టిఫికేట్ రాగానే వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అని నిర్మాత స్పష్టం చేశారు.

అసలు వివాదం ఏమిటి?

నటుడిగా విజయ్ కెరీర్‌లో 'జన నాయగన్' ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజూ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. కానీ సీబీఎఫ్‌సీ సకాలంలో సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో సినిమా వాయిదా పడింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, డిసెంబర్ 2025లోనే ఈ సినిమాను సీబీఎఫ్‌సీ ఎగ్జామినింగ్ కమిటీకి ప్రదర్శించారు. ఆ సమయంలో కమిటీ కొన్ని సీన్లకు కట్స్ సూచించి, ఆ మార్పులు చేస్తే 'U/A' సర్టిఫికేట్ ఇస్తామని చెప్పింది. నిర్మాతలు కూడా ఆ మార్పులకు అంగీకరించి ఎడిట్ చేసిన వెర్షన్‌ను మళ్లీ సబ్మిట్ చేశారు.

కుట్ర దాగి ఉందని

అయితే జన నాయగన్ సెన్సార్ వివాదం కథ అడ్డం తిరిగింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఫిర్యాదులు రావడంతో, సీబీఎఫ్‌సీ చైర్మన్ ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. దీంతో ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతూ సినిమా విడుదల ప్రణాళికలను, అంతర్జాతీయ పంపిణీ ఒప్పందాలను పూర్తిగా దెబ్బతీసింది.

ఈ ఆలస్యం వెనుక అప్పటి అధికార పార్టీల 'కుట్ర' దాగి ఉందని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికే ఇలా చేశారని విజయ్ స్వయంగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలను కూడా కావాలనే లీక్ చేశారని ఆయన మండిపడ్డారు.

పైరసీ కలకలం

ఏప్రిల్ నెలలో ఈ సెన్సార్ వివాదం నడుస్తున్న సమయంలోనే 'జన నాయగన్' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. అంతటితో ఆగకుండా, పూర్తి సినిమా హెచ్‌డీ ప్రింట్లు పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడం షాక్ కు గురి చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ద్వారా విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడానికి సరిగ్గా ముందే ఈ లీక్ జరగడం గమనార్హం. ఈ పైరసీ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' ఎప్పుడు విడుదలవుతుంది?

టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో జూన్ 19 లేదా జూన్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చూపిస్తోంది. అయితే, సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత వెంకట్ కె. నారాయణ తెలిపారు.

2. 'జన నాయగన్' సినిమా ఎందుకు ఆలస్యమైంది?

సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దీనిని రివైజింగ్ కమిటీకి పంపింది. ఈ సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పటివరకు నిలిచిపోయింది.

3. ఈ సినిమాలో విజయ్‌తో పాటు ఎవరెవరు నటిస్తున్నారు?

హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజూ, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More