Bigg Boss 10: బిగ్ బాస్ 10 అగ్నిప‌రీక్ష‌లో అదిరే స‌ర్‌ప్రైజ్‌.. ఆ గోల్డెన్ టికెట్ ఎవ‌రికో? లక్కీ కంటెస్టెంట్ ఆమెనేనా?

Bigg Boss 10: ఇంకో రెండు రోజులే. తెలుగు ఆడియన్స్ కు అదిరిపోయే కిక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ పై బజ్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష ఫినాలే ఎపిసోడ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. గోల్డెన్ టికెట్ సర్ ప్రైజ్ అదిరిపోయింది. 

Published on: Sep 4, 2026, 12:18:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: బుల్లితెరపై సంచలనంగా మారిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో లాంఛ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఎండింగ్ కు చేరుకుంది.

బిగ్ బాస్ 10 అగ్నిప‌రీక్ష‌లో అదిరే స‌ర్‌ప్రైజ్‌.. ఆ గోల్డెన్ టికెట్ ఎవ‌రికో? లక్కీ కంటెస్టెంట్ ఆమెనేనా? (youtube/starmaa)
బిగ్ బాస్ 10 అగ్నిప‌రీక్ష‌లో అదిరే స‌ర్‌ప్రైజ్‌.. ఆ గోల్డెన్ టికెట్ ఎవ‌రికో? లక్కీ కంటెస్టెంట్ ఆమెనేనా? (youtube/starmaa)

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సర్ ప్రైజ్

కామనర్లకు బిగ్ బాస్ ఎంట్రీ కల్పించేందుకు నిర్వహిస్తున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ కు వచ్చేసింది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ఈ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే కోసం మేకర్స్ ఓ భారీ సర్ ప్రైజ్ ను ప్రకటించారు. అదే గోల్డెన్ టికెట్. అది పొందిన వాళ్లు డైరెక్ట్ గా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.

కామనర్లు షాక్

అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్లో మొత్తం 13 మంది పోటీపడుతున్నారు. ఈ ఫినాలే ఎపిసోడ్ లో గోల్డెన్ టికెట్ గురించి యాంకర్ శ్రీముఖి చెప్పగానే కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని టాస్క్ బరిలోకి దూకేశారు. ఈ 13 మందికి టాస్క్ లు పెడుతున్నారు మేకర్స్. ఇందులో గెలిచిన వాళ్లు డైరెక్ట్ గా గోల్డెన్ టికెట్ తో బిగ్ బాస్ 10కు వెళ్లిపోతారు.

గోల్డెన్ టికెట్ ఆమెకేనా?

అయితే ఇప్పటికే కామనర్ల నుంచి సింగర్ ఝాన్సీకి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ బెర్త్ కన్ఫామ్ అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అగ్నిపరీక్షలో ఆట, మాటల్లో ఝాన్సీ అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. మరి ఈ గోల్డెన్ టికెట్ గెలుచుకొని ఝాన్సీ డైరెక్ట్ గా హౌస్ కు సెలెక్ట్ అవుతుందేమో చూడాలి.

గ్రాండ్ లాంఛ్

మైల్ స్టోన్ లాంటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘దశావతారం’ కాన్సెప్ట్ తో ఈ సారి సీజన్ ను డిఫరెంట్ గా కొనసాగించనున్నారని టాక్. మరోసారి బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కింగ్ అక్కినేని నాగార్జున అలరించేందుకు రెడీ అవుతున్నారు.

కంటెస్టెంట్స్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ పై రోజుకో ప్రచారం సాగుతోంది. జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరియల్ యాక్టర్లు ముఖేష్, చైత్ర రాయ్, దేబ్జానీ, టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ తదితరులు బిగ్ బాస్ లోకి అడుగుపెడతారనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More