Bigg Boss 10: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష.. హౌస్ లోకి అడుగుపెట్టే కామనర్లు వీళ్లే.. లిస్ట్ లీక్.. వైరల్ నేమ్స్!

Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. మరో నాలుగు రోజుల్లోనే ఈ సరికొత్త సీజన్ గ్రాండ్ గా లాంఛ్ కానుంది. ఈ నేపథ్యంలో హౌస్ లో అడుగుపెట్టే సెలబ్రిటీలు ఎవరు? అగ్ని పరీక్ష నుంచి ఎవరు వస్తారన్నది క్యూరియాసిటీ పెంచుతోంది. మరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్లు ఎవరన్నది ఇక్కడ చూసేయండి.

Published on: Sep 2, 2026, 12:58:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: బుల్లితెరపై మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ వచ్చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది.

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష.. హౌస్ లోకి అడుగుపెట్టే కామనర్లు వీళ్లే.. లిస్ట్ లీక్.. వైరల్ నేమ్స్! (instagram)
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష.. హౌస్ లోకి అడుగుపెట్టే కామనర్లు వీళ్లే.. లిస్ట్ లీక్.. వైరల్ నేమ్స్! (instagram)

బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో సెలబ్రిటీలకే కాకుండా కామనర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2025లో అగ్నిపరీక్ష స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కూడా అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష ఎండింగ్ కు చేరుకుంది.

ఈ సారి ఎవరు?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పడాల కళ్యాణ్, డీమాన్ పవన్, శ్రీజ, హరిత హరీష్, మర్యాద మనీష్ లాంటి కంటెస్టెంట్లు అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లారు. మరి ఈ సారి సీజన్ లో అగ్నిపరీక్ష నుంచి ఏ కామనర్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

లిస్ట్ లీక్

అగ్నిపరీక్ష నుంచి 2 నుంచి బిగ్ బాస్ 10 తెలుగులోకి వెళ్తున్న కామనర్లు వీళ్లేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ తెగ వైరల్ గా మారింది. ఇందులో సింగర్ ఝాన్సీ, రోహిత్ నాయుడు, సృష్టి వ్యాకరణం, ఆర్జే చరణ్, నవరసాలు ఆర్కే, శాలిని, అపూర్వ, రాజకుమారి పేర్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఆరు మందిని హౌస్ కు సెలక్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఈ ఇద్దరు కన్ఫామ్?

అగ్నిపరీక్షలో సత్తాచాటిన సింగర్ ఝాన్సీ, రోహిత్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం ఖాయమనే అభిప్రాయాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఝాన్సీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్. ఇక రోహిత్ నాయుడు కూడా కన్ఫామ్ అని అంటున్నారు. వీళ్లతో పాటు సృష్టి వ్యాకరణం, ఆర్జే చరణ్, నవరసాలు కూడా హౌస్ లోకి వెళ్తారని సమాచారం.

ఇద్దరిలో ఒకరు

ఇక శాలిని, అపూర్వ విషయం చూసుకుంటే.. వీళ్లలో ఒకరికే హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిసింది. మరి ఆ లక్కీ భామ ఎవరో చూడాలి. మరోవైపు తన రియల్ స్టోరీతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రాజకుమారి కూడా రేసులో ఉందని అంటున్నారు. కానీ తనకు చాలా తక్కువ అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ కామనర్లలో ఎవరు బిగ్ బాస్ లోకి వెళ్తారన్నది సెప్టెంబర్ 6న తేలిపోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More