Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష.. కామనర్లకు షాకింగ్ రెమ్యునరేషన్.. హౌస్ కు వెళ్తే ఎంతో తెలుసా?

Bigg Boss 10 Remuneration: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే రాబోతుంది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు వచ్చే వారమే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో అగ్నిపరీక్షలో పోటీపడుతున్న కామనర్లకు ఇచ్చే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. 

Published on: Aug 30, 2026, 16:50:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 Remuneration: ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత నెగెటివిటీ స్ప్రెడ్ అయినా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సారి అంచనాలను మించేలా కొత్త సీజన్ ను డిజైన్ చేస్తున్నారు. మైల్ స్టోన్ లాంటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.

బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష.. కామనర్లకు షాకింగ్ రెమ్యునరేషన్.. హౌస్ కు వెళ్తే ఎంతో తెలుసా? (youtube/starmaa)
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష.. కామనర్లకు షాకింగ్ రెమ్యునరేషన్.. హౌస్ కు వెళ్తే ఎంతో తెలుసా? (youtube/starmaa)

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష

బిగ్ బాస్ రియాలిటీ షోలో కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గతేడాది అగ్నిపరీక్ష అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కామనర్లకు ఆడిషన్, టాస్క్ లు పెట్టి ఇందులో నుంచి బిగ్ బాస్ కు సెలెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష నుంచి కామనర్ గా వెళ్లిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ రెమ్యునరేషన్

ఈ సారి కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్లకు అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో ఎండింగ్ కు వచ్చేసినట్లే. ఇప్పటికే అగ్ని పరీక్ష నుంచి సింగర్ ఝాన్సీ, రోహిత్ బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పోటీపడుతున్న కామనర్ల రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

ఒక్కొక్కరికి

బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో పోటీపడుతున్న కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారని టాక్. ఇక అగ్నిపరీక్షలో గెలిచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్లకు అక్కడ వారానికి రూ.70 వేల చొప్పున చెల్లిస్తారని సమాచారం.

గ్రాండ్ లాంఛ్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దశావతారం కాన్సెప్ట్ తో ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా షోను రూపొందిస్తున్నారని టాక్. మరోసారి అక్కినేని నాగార్జున తన హోస్టింగ్ తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మైల్ స్టోన్ లాంటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.

వీళ్లు కన్ఫామ్?

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీల లిస్ట్ వైరల్ గా మారింది. జబర్దస్త్ నటులు రాంప్రసాద్, నరేష్ తో పాటు సీరియల్ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కన్ఫామ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఏ సెలబ్రిటీలు బిగ్ బాస్ లోకి వస్తారనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More