Jyothika Suriya: అప్పట్లో సూర్య కంటే 3 రెట్లు ఎక్కువ..ఇప్పుడు 30 రెట్లు తక్కువ..రెమ్యునరేషన్ పై జ్యోతిక కామెంట్స్ వైరల్!

Jyothika Suriya: భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందారు సూర్య, జ్యోతిక. ఈ జంట 20 ఏళ్ల ప్రేమకు దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో సూర్య రెమ్యునరేషన్ తో తన రెమ్యునరేషన్ పోలుస్తూ జ్యోతిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

Published on: Aug 5, 2026, 09:07:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jyothika Suriya: 1999లో వచ్చిన 'పూవెల్లం కేట్టుప్పార్' చిత్రం సెట్స్‌లో మొదలైన సూర్య - జ్యోతికల పరిచయం, 2003లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఐకానిక్ హిట్ 'కాక కాక' (Kaakha Kaakha) సమయానికి ప్రేమగా మారింది. 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో ఒకటైన ఈ జంట త్వరలోనే తమ 20వ పెళ్లిరోజు వేడుకను జరుపుకోబోతున్నారు.

అప్పట్లో సూర్య కంటే 3 రెట్లు ఎక్కువ..ఇప్పుడు 30 రెట్లు తక్కువ..రెమ్యునరేషన్ పై జ్యోతిక కామెంట్స్ వైరల్! (PTI )
అప్పట్లో సూర్య కంటే 3 రెట్లు ఎక్కువ..ఇప్పుడు 30 రెట్లు తక్కువ..రెమ్యునరేషన్ పై జ్యోతిక కామెంట్స్ వైరల్! (PTI )

తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ బంధం, ఇంట్లోని సమానత్వం, రెమ్యునరేషన్ వివరాలపై సూర్య, జ్యోతిక జంట ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

సూర్య కంటే 3 రేట్లు ఎక్కువ

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతుందని తెలిసిందే. అయితే తమ కెరీర్ ప్రారంభంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేదని జ్యోతిక గుర్తుచేసుకున్నారు. 'కాక కాక' సినిమా సమయంలో సూర్యతో పోలిస్తే జ్యోతికకు 3 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ లభించేది.

ఇప్పుడు తక్కువ

"అప్పుడు నాకంటే సూర్య పారితోషికం 3 రెట్లు తక్కువ.. కానీ ఇప్పుడు నా రెమ్యూనరేషన్ ఆయన కంటే 30 రెట్లు తక్కువ" అంటూ జ్యోతిక సరదాగా నవ్వేశారు. సమాన హోదా, ఎక్కువ పారితోషికం పొందే సహనటి పట్ల పురుష నటుల్లో ఉండే ఈగోను దాటి, సూర్య ఎప్పుడూ తనను గౌరవిస్తూ ప్రోత్సహించేవారని జ్యోతిక వెల్లడించారు.

సూర్య పక్కా గ్రీన్ ఫ్లాగ్

సూర్య నిజమైన 'గ్రీన్ ఫ్లాగ్' (Green Flag) మెటీరియల్ అని కొనియాడిన జ్యోతిక, ఒక భర్తగా ఆయన ఆలోచనా విధానాన్ని ప్రశంసించారు. "ఒక నటుడిగా సూర్య ప్రతిభ అందరికీ తెలిసిందే. కానీ ఒక వ్యక్తిగా, భర్తగా ఆయన చాలా ప్రత్యేకమైనవారు. ఆయన మైండ్‌లో స్త్రీ, పురుషుల పట్ల సమానత్వం ఉంటుంది.

అది లోపలి నుంచి రావాలి, నేర్పితే వచ్చేది కాదు. ఇంట్లో మేమిద్దరం సమానం. ఆమె వంట చేయకూడదు అనుకుంటే చేయక్కర్లేదు అనేంత స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. విమెన్ ఎంపవర్‌మెంట్ అని పైకి చెప్పడం కాదు, మనసులో నిజమైన గౌరవం ఉన్న పురుషుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది" అని జ్యోతిక స్పష్టం చేశారు.

సూర్య లైఫ్ అడ్వైజ్

తన రాబోయే చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) ప్రమోషన్ల సందర్భంలో మాట్లాడిన సూర్య.. శాశ్వతమైన ప్రేమ, దాంపత్య జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రేమ అయిపోకూడదు. 20 ఏళ్లు గడిచినా సరే ప్రతీ రోజూ మీ భాగస్వామిని ప్రేమిస్తూనే ఉండాలి. వారిని గౌరవించడం ఆపకూడదు" అని సూర్య తెలిపారు.

20 ఏళ్ల వయసులో ఉండే పరిణతి 25 లేదా 50 ఏళ్లకు ఉండదని, మనుషులు, ఆలోచనలు, ప్రాధాన్యతలు మారినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉండే అనురాగం, గౌరవం మాత్రం మారకూడదని ఆయన సూచించారు.

ప్రస్తుత ప్రాజెక్టులు

‘కరుప్పు’ (Karuppu) చిత్రంతో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న సూర్య.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లో నటిస్తున్నారు.

ఓటీటీ దిగ్గజం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన కోర్ట్‌రూమ్ లీగల్ డ్రామా ‘సిస్టమ్’ (System) లో జ్యోతిక నటించారు. శక్తివంతమైన న్యాయవాది పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More