Vishwanath And Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చేది ఆ రోజే.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూర్య.. కరుప్పు సక్సెస్ జోష్

Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రిలీజ్ డేట్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. జూలైలో రావాల్సిన ఈ మూవీ విడుదల తేదీని మార్చారు. కొత్త డేట్ ను ఇవాళ అధికారికంగా ప్రకటించారు.

Published on: May 28, 2026, 13:43:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwanath And Sons: ఇటీవలే ‘కరుప్పు’ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. మరో కొత్త మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రిలీజ్ డేట్ (x/SitharaEnts)
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రిలీజ్ డేట్ (x/SitharaEnts)

విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇది సూర్య 46వ మూవీ. ఈ క్రేజీ సినిమా విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక రోజుే ముందుగానే ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్, సూర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు.

జూలైలో అనుకున్నా

వాస్తవానికి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీని జూలైలోనే విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

విభిన్నమైన కథాంశంతో

ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో సూర్య ఒక విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడు. 40 ఏళ్ల వయసున్న సంజయ్ విశ్వనాథ్ (సూర్య) అనే ఒక లీడింగ్ పిస్టల్ షూటర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వయసు పైబడుతున్న కొద్దీ తన ఆటలో ఏకాగ్రతను, వేగాన్ని కాపాడుకోవడానికి అతను పడే తాపత్రయం ఇందులో ప్రధానంగా సాగుతుంది.

ఇదే సమయంలో, 20 ఏళ్ల వయసున్న మ్యాడీ (మమితా బైజూ) అనే యువతి అతనితో ప్రేమలో పడుతుంది. వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల సంజయ్ ఆమె ప్రేమను తిరస్కరించినప్పటికీ, వారి మధ్య ఏర్పడే భావోద్వేగపూరిత బంధం, తదనంతర పరిణామాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ మూవీ స్టోరీ.

24 ఏళ్ల తర్వాత రవీనా టాండన్ రీఎంట్రీ

ఈ చిత్రంలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, భవానీ శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరితో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఒక తమిళ సినిమాలో నటించడం దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరగా ఆమె 2001లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన 'ఆలవందాన్' (తెలుగులో అభయ్) సినిమాలో నటించింది.

క్రేజీ కాంబినేషన్స్

ఈ ప్రతిష్టాత్మక విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'వాతి' (సార్), 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాల తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో జి.వి.ప్రకాష్‌కి ఇది మూడో సినిమా. అలాగే, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'సూరరై పోట్రు' (ఆకాశం నీ హద్దురా) చిత్రం తర్వాత సూర్యతో జి.వి.ప్రకాష్ కలిసి పనిచేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'విశ్వనాథ్ & సన్స్' సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?

జవాబు: ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రశ్న: ఈ చిత్రంలో సూర్య పోషిస్తున్న పాత్ర ఏమిటి?

జవాబు: ఈ సినిమాలో సూర్య.. సంజయ్ విశ్వనాథ్ అనే 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తాడు.

ప్రశ్న: రవీనా టాండన్ చివరిగా నటించిన తమిళ సినిమా ఏది?

జవాబు: రవీనా టాండన్ చివరగా 2001లో కమల్ హాసన్ సరసన 'ఆలవందాన్' (తెలుగులో అభయ్) సినిమాలో నటించారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More