Vishwanath And Sons Teaser: 40 ఏళ్ల షూటర్‌తో 20 ఏళ్ల అమ్మాయి లవ్- హాయినచ్చే సంగీతంతో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ !

Vishwanath And Sons Teaser Released: తమిళ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఇవాళ విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ విడుదలైంది. ఒక ఇంటర్నేషనల్ షూటర్ తండ్రిగా మారిన తర్వాత తన బాధ్యతలను ఎలా నెరవేర్చాడనే హృద్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

Mar 16, 2026, 19:28:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. లక్కీ భాస్కర్, సార్ వంటి సూపర్ హిట్స్ అందించిన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన లేటెస్ట్ మూవీనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons).

40 ఏళ్ల షూటర్‌తో 20 ఏళ్ల అమ్మాయి లవ్- హాయినచ్చే సంగీతంతో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ !
40 ఏళ్ల షూటర్‌తో 20 ఏళ్ల అమ్మాయి లవ్- హాయినచ్చే సంగీతంతో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ !

తాజాగా ఇవాళ (మార్చి 16) విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

షూటర్ నుంచి తండ్రిగా.. సంజయ్ విశ్వనాథ్ ప్రయాణం

ఈ చిత్రంలో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా తన లక్ష్యం కోసం పోరాడే అథ్లెట్‌గా, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ఆయన పడే తపన టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా చేతిలో ఉన్న తుపాకీని వదిలి పాల సీసా పట్టుకోవడం అనే విజువల్.. ఈ సినిమాలో తండ్రి-బిడ్డల మధ్య ఉండే ఎమోషన్ ఎంత బలంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.

విశేషమేమిటంటే, సూర్య కెరీర్‌లో మైలురాయి లాంటి ‘గజినీ’ చిత్రంలోని ఆయన పాత్ర పేరు ‘సంజయ్ రామస్వామి’ కావడంతో, ఈ ‘సంజయ్ విశ్వనాథ్’పై అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల పోలికలు వెతుకుతున్నారు.

వయసుతో సంబంధం లేని ప్రేమకథ

ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం.. సూర్య, మమితా బైజు మధ్య సాగే ప్రేమకథ. కథలో భాగంగా వీరిద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి మార్కు మెచ్యూరిటీతో ఈ లవ్ ట్రాక్ నడుస్తుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. మమితా బైజు తన సహజమైన నటనతో ఆకట్టుకుంటోంది.

నాలుగు చిటికెలు వేస్తా

‘నాకంటే 20 ఏళ్లు చిన్నది’ అని సూర్య చెప్పే డైలాగ్, ‘నాకు పర్వాలేదు’ అని మమితా సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘చిటికేస్తే నీ వయసు కుర్రాళ్లు వేలల్లో వస్తారని’ సూర్య అంటే.. ‘నాలుగు చిటికెలు వేస్తా.. నువ్వు పడు’ అని మమితా బైజు చెప్పే డైలాగ్ అలరించేలా ఉంది.

హాయినిచ్చే బీజీఎమ్

40 ఏళ్ల షూటర్ సంజయ్ విశ్వనాథ్‌తో 20 ఏళ్ల అమ్మాయి లవ్ ట్రాక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తోడుగా రొమాంటిక్‌గా, హాయినిచ్చేలా బీజీఎమ్ ఉంది. లవ్, ఎమోషన్స్, స్పోర్ట్స్ వంటి అంశాలతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సాగుతుందని టీజర్ ద్వారా తెలుస్దోంది.

భారీ తారాగణం.. టెక్నికల్ టీమ్

ఇదిలా ఉంటే, ఈ చిత్రంతో సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం విశేషం. 2001లో వచ్చిన ‘ఆలవందాన్’ తర్వాత ఆమె మళ్లీ ఈ సినిమాతోనే కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

వీరితో పాటు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో రాధికా శరత్‌కుమార్, భవాని శ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని తీసుకువచ్చింది.

సార్ తర్వాత

తెలుగులో మంచి విజయాలు అందుకున్న వెంకీ అట్లూరి సార్ (వాతి) తర్వాత మరోసారి తమిళంలో తన మార్క్ చూపించినున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More