Itlu Arjuna: బండోడి మ్యూజిక్.. బక్కోడి పాట.. ఇట్లు అర్జున్ మూవీ కోసం చేతులు కలిపిన తమన్, అనిరుధ్.. సాంగ్ ప్రోమో రిలీజ్
Itlu Arjuna: ఇట్లు అర్జున మూవీ మేకర్స్ ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కోసం మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, అనిరుధ్ రవిచందర్ లను కలిపారు. అయితే బండోడు, బక్కోడు అంటూ వీళ్లను పరిచయం చేయడం ఇక్కడ నవ్వు తెప్పిస్తోంది.
Itlu Arjuna: మ్యూజిక్ లవర్స్ కు ఒక క్రేజీ అప్‌డేట్. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ఈ కొలాబొరేషన్‌ను సరదాగా “బక్కోడు X బండోడు” అని పిలుచుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వస్తున్న ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna) మూవీ కోసం ఈ ఇద్దరు దిగ్గజాలు జతకట్టారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. సింగర్ అనిరుధ్
మంగళవారం (మే 26) ఉదయం నుంచి సోషల్ మీడియాలో సస్పెన్స్ క్రియేట్ చేసిన అనిరుధ్, తమన్.. చివరకు తమ సరికొత్త కాంబినేషన్ వివరాలను ఒక క్యూట్ ప్రోమో ద్వారా బయటపెట్టారు.
ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హై రే’ (Hai Re)కు తన గాత్రాన్ని అందించారు. ఈ ప్రోమోలో ఇద్దరు సంగీత దర్శకుల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రోమోలోని ఆసక్తికర సంభాషణ
ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమో మొదట్లో తమన్, అనిరుధ్ ఇంట్రడక్షన్ ఫన్నీగా సాగింది. పాట ఎవరి దగ్గరికి వెళ్తున్నారు సర్ అని అనిరుధ్ ని అడిగితే.. బండోడి దగ్గరికి అని అతడు చెబుతాడు. పాడటానికి ఎవరొస్తున్నారన్నా అని తమన్ ను అడిగితే అతడు మన బక్కోడు అని అంటాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇందులో చూడొచ్చు.
ఆ తర్వాత అనిరుధ్.. "ఇదేం మాస్ సాంగ్ బాస్?" అని తమన్‌ను అడగ్గా.. "ఇది మాస్ సాంగ్ కాదు బ్రదర్, ఒక ప్యూర్ లవ్ సాంగ్" అంటూ తమన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ బ్యూటిఫుల్ మెలోడీ లవ్ సాంగ్ పూర్తి ట్రాక్‌ను మే 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కథలో సంగీతానిదే కీలక పాత్ర
ఈ మూవీతో అనీష్ అనే కొత్త నటుడు టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతుండగా, మహేష్ ఉప్పాల దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. 'ఇట్లు అర్జున' చిత్రంలో కథానాయకుడు వినికిడి లోపం, మూగ సమస్యలతో బాధపడే పాత్రలో కనిపిస్తాడు.
హీరో మాట్లాడలేడు, వినలేడు కాబట్టి, ఈ కథలో భావోద్వేగాలను పండించడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు అత్యంత కీలకమైన పాత్ర పోషించనున్నాయని మేకర్స్ తెలిపారు. 'రౌడీ బాయ్స్' ఫేమ్ అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం విడుదలైన ఈ చిన్న ప్రోమో సాంగ్స్ లవర్స్‌లో పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ఇట్లు అర్జున' సినిమా ప్రత్యేకత ఏంటి?
ఈ సినిమాలో కథానాయకుడు వినికిడి లోపం, మూగ సమస్యలు ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. అందువల్ల సినిమా కథాంశంలో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమైన పాత్ర పోషించనున్నాయి.
2. "బక్కోడు X బండోడు" అంటే ఎవరు?
సంగీత దర్శకులు అనిరుధ్ రవిచందర్ (బక్కోడు), ఎస్.ఎస్. తమన్ (బండోడు)లను ఉద్దేశించి వారి శారీరక రూపాన్ని బట్టి సరదాగా పెట్టుకున్న పేరు ఇది.
3. 'హై రే' (Hai Re) పూర్తి పాట ఎప్పుడు విడుదలవుతుంది?
తమన్ మ్యూజిక్ అందించగా.. అనిరుధ్ పాడిన ఈ లవ్ మెలోడీ సాంగ్ మే 28న విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


