Jyotika: చేసింది చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో.. మాలో భయం దూరం చేసిన జెన్ జీ, సీజేపీకి థ్యాంక్స్: జ్యోతిక సంచలన పోస్ట్

Jyotika: జ్యోతిక చేసిన సంచలన పోస్ట్ వైరల్ అవుతోంది. ఢిల్లీలో జెన్ జీ, సీజేపీ చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపిన ఆమె.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. తమలో భయం దూరం చేసిన సీజేపీకి థ్యాంక్స్ చెప్పింది.

Published on: Jul 25, 2026, 11:04:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jyotika: దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంలో కోలీవుడ్ నటి జ్యోతిక సంచలన పోస్ట్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించారు. విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.

Jyotika: చేసింది చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో.. మాలో భయం దూరం చేసిన జెన్ జీ, సీజేపీకి థ్యాంక్స్: జ్యోతిక సంచలన పోస్ట్
Jyotika: చేసింది చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో.. మాలో భయం దూరం చేసిన జెన్ జీ, సీజేపీకి థ్యాంక్స్: జ్యోతిక సంచలన పోస్ట్

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక పవర్‌ఫుల్ నోట్ షేర్ చేసిన జ్యోతిక.. "జై హింద్" అంటూ పోరాటం చేస్తున్న విద్యార్థుల వైపు నిలబడ్డారు. మన దేశ భవిష్యత్తు అయిన స్టూడెంట్స్ కోసమే తాను గళం వినిపిస్తున్నానని, విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.

"ధర్మేంద్ర ప్రధాన్.. మీ పదవి నుంచి తప్పుకోండి!"

"ధర్మేంద్ర ప్రధాన్.. వెంటనే మీ పదవి నుంచి తప్పుకోండి! రాజీనామా చేయండి! దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల తరఫున, పారదర్శకమైన ప్రజాస్వామ్య భారత్ కోసం నేను నిలబడుతున్నా. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు రావాల్సిందే" అని జ్యోతిక తన పోస్ట్‌లో చాలా ఘాటుగా రాసుకొచ్చారు.

సుదీర్ఘ కాలంగా నిరసన తెలపడమే కాకుండా 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసిన సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk), అభీజిత్ దిప్కే, సౌరవ్ దాస్‌లకు జ్యోతిక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలు కూడా భవిష్యత్తులో వీరిలాగే నిలబడేలా పెంచాలని కోరుకుంటున్నట్లు చాలా ఎమోషనల్ అయ్యారు.

జెన్ జీ పోరాటంపై ప్రశంసలు.. తల్లిగా స్పందించిన జ్యోతిక

జెన్ జీ (Gen Z) యువత ఏమాత్రం భయం లేకుండా ఏకమై పోరాడుతుండటాన్ని చూసి గర్వపడుతున్నానని జ్యోతిక కొనియాడారు. విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తొలగించి, ఈ పోరాటంలో నిర్భయంగా ముందడుగు వేసేలా చేసిన సీజేపీకి కృతజ్ఞతలు చెప్పారు. "మీరందరూ కలిసి మేమంతా ఒక్కటే భారతీయులమని నిరూపించారు" అని కొనియాడారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)ను పెళ్లి చేసుకున్న జ్యోతికకు కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. ఒక తల్లిగా పిల్లల చదువు, వారి భవిష్యత్తు ఎంత ముఖ్యమో తెలిసినందుకే ఆమె ఈ విషయంలో నేరుగా స్పందించినట్లు తెలుస్తోంది. 'చంద్రముఖి', '36 వయదినిలే', 'కాదల్ ది కోర్', 'సైతాన్' లాంటి వైవిధ్యమైన సినిమాలతో నటనలో తన ప్రత్యేక ముద్ర వేసిన జ్యోతిక, సామాజిక విషయాలపై కూడా ఎప్పుడూ స్పందిస్తుంటారు.

ఊపందుకున్న దేశవాప్త నిరసనలు.. బాలీవుడ్ మద్దతు

ఈ నీట్ నిరసన ఉద్యమానికి ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అలియా భట్, సల్మాన్ ఖాన్, హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, సోనాక్షి సిన్హా, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, స్వర భాస్కర్ లాంటి ఎందరో ప్రముఖులు ఇప్పటికే విద్యార్థులకు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

జులై 20న పార్లమెంట్ వైపు సాగిన సీజేపీ విద్యార్థుల మార్చ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, పేపర్ లీక్ ఘటనలో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపమని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More