Bigg Boss 10 Agnipariksha: నుదుటిపై ‘తూ నా జీవితం’ టాటూ.. ముఖాలపై చెత్త.. బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష .. టాస్క్ లపై ఫైర్!
Bigg Boss 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు 10 'అగ్నిపరీక్ష' షోను వివాదాలు వీడటం లేదు. తాజా ప్రోమోలతో విమర్శలు మరింత పెరిగాయి. ప్రోమోలో చూపించిన ప్రమాదకర 'డేర్ ఆర్ డై' టాస్క్‌లపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఆర్‌పీ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Bigg Boss 10 Agnipariksha: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్’. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్ట్ కానుంది. అయితే దానికంటే ముందు నిర్వహిస్తున్న బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ షో ప్రోమోలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ల మధ్య పోరు షురూ అయింది. అయితే ఇందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం కోసం నిర్వహిస్తున్న టాస్క్ లపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
డేర్ ఆర్ డై
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష తాజా ప్రోమోలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. 'అగ్నిపరీక్ష' ప్రోమోలో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. "షోలో కొనసాగాలంటే ఎలాంటి ప్రమాదకరమైన సవాలునైనా స్వీకరించాల్సిందే" అనే రీతిలో ‘డేర్ ఆర్ డై’ టాస్క్‌లను డిజైన్ చేశారు. పోటీదారులు భయంతో అరుస్తున్న దృశ్యాలు, తీవ్ర ఒత్తిడిలో కన్నీళ్లు పెట్టుకుంటున్న షాట్లు ఈ ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖంపై చెత్త
అగ్నిపరీక్షలో భాగంగా కంటెండర్స్ కు ముఖంపై కూరగాయల వ్యర్థాలు వేసుకోవాలని ఛాలెంజ్ ఇచ్చారు. ఆ కంపును భరిస్తూ బాక్స్ లు ఓపెన్ చేయాలి. ఇక మరో టాస్క్ అయితే మరింత దారుణంగా ఉంది. నుదుటిపై ‘తూ నా జీవితం’ అని టాటూ వేసుకోవాలంటా. అది కూడా పురుషులకు మాత్రమే. దీనికి కూడా పోటీదారులు సై అనడం గమనార్హం.
సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్
ఈ ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పటి నుంచి ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వీక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం షో పబ్లిసిటీ కోసం, టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం పోటీదారుల ప్రాణాలతో ఆడుకోవడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు నిలదీస్తున్నారు. "ఇది వినోద కార్యక్రమమా లేక మానసిక హింసను ప్రదర్శించే షోనా?" అంటూ పలువురు నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే వివాదాలు
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షపై ఇప్పటికే వివాదాలు ముసురుకున్నాయి. సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు పట్ల నవదీప్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖి బిహేవియర్ కూడా వరస్ట్ గా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కనీసం మనుషుల్లా చూడకుండా షోకు పిలిచి అవమానించారని ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా ఫీల్ అవుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


