Bigg Boss Telugu Nagarjuna: ఈసారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాల్.. అన్నీ 10 రెట్లు ఎక్కువ: బిగ్ బాస్ నాగార్జున కొత్త ప్రోమో
Bigg Boss Telugu Nagarjuna: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. ఇందులో పది రెట్ల వినోదం అంటూ నాగార్జున సరికొత్త లుక్స్ లో కనిపించి అలరించారు. ఈసారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాల్ అంటూ నాగ్ అనడం గమనార్హం.
Bigg Boss Telugu Nagarjuna: నాగార్జున 'దశావతారం' ప్రోమోతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా అనౌన్స్ కాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఈసారి '10X డ్రామా, 10X సర్ ప్రైజెస్' అంటూ నాగ్ ప్రామిస్ చేసినా, అంతలోనే 'అగ్నిపరీక్ష' షోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నెటిజన్ల ఫైర్‌కు కారణమైంది. కంటెంట్ క్రియేటర్ ఉప్పల్ బాలును అవమానించారంటూ నటుడు నవదీప్‌పై, బిగ్ బాస్ టీమ్‌పై భారీగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది.

నాగార్జున 10X ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోమో
ఈ మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో కోసం కింగ్ నాగార్జున సరికొత్త గెటప్స్‌లో కనిపించి షాక్ ఇచ్చారు. టీ అమ్మే వ్యక్తిగా, పూల వ్యాపారిగా, రిపోర్టర్‌గా, స్టంట్ మాస్టర్‌గా నాగ్ డిఫరెంట్ లుక్స్‌లో అలరించారు. "ఈసారి ఆటలో సవాల్ కాదు... ఆటే సవాల్" అంటూ సీజన్ 10 రేంజ్ ఏంటో ప్రోమోలోనే స్పష్టం చేశారు.
తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో నాగార్జున హోస్ట్‌గా రావడం ఇది 9వ సారి కావడం విశేషం. సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్ చేయగా.. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు, అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్‌ను నాగార్జునే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా నడిపించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక 10వ సీజన్ కోసం ఆయన మరింత జోష్‌తో రెడీ అయ్యారు.
'అగ్నిపరీక్ష' వివాదం.. ఉప్పల్ బాలు ఇష్యూ ఏంటి?
ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసేందుకు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' ఆగస్టు 15 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు వచ్చే ఈ ప్రీ-షోలో ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఉప్పల్ బాలు హాజరయ్యారు. అయితే ఆడిషన్‌లో తనను తీవ్రంగా అవమానించారని బాలు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడంతో వివాదం రేగింది.
తనను షోకి పిలిచి 'వల్గర్ వీడియోలు చేస్తావ్' అని జడ్జ్ పొజిషన్‌లో ఉన్న నటుడు నవదీప్ పర్సనల్‌గా టార్గెట్ చేశారని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. రిజెక్ట్ చేయడం ఓకే కానీ మనిషిగా కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించిన వీడియో నెట్‌లో తెగ వైరల్ అయింది.
'జస్టిస్ ఫర్ ఉప్పల్ బాలు'.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ డిమాండ్
బాలు వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ బిగ్ బాస్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నాగార్జున పోస్ట్ చేసిన ప్రోమో కామెంట్ సెక్షన్‌లో అంతా ఉప్పల్ బాలు పేరే కనిపిస్తోంది. "కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలా మాట్లాడినందుకు నవదీప్, బిగ్ బాస్ టీమ్ బాలుకి సారీ చెప్పాలి" అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా బాలుకి రెండో ఛాన్స్ ఇచ్చి సీజన్ 10 హౌస్‌లోకి పంపాలని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. "జస్టిస్ ఫర్ ఉప్పల్ బాలు... అతడిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి పంపాల్సిందే" అంటూ యూట్యూబ్‌లో వేల సంఖ్యలో మెసేజ్‌లు కామెంట్ చేస్తున్నారు.
సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్.. స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో..
ఈ భారీ వివాదం నడుమ బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. స్టార్ మా ఛానెల్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ షో టెలికాస్ట్ కానుంది. ప్రతిసారీ కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు, గొడవలతో టీఆర్‌పీ రికార్డులు తిరగరాసే బిగ్ బాస్, ఈ 10వ మైల్‌స్టోన్ సీజన్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


