Uppal Balu: నీకెందుకు రా నవదీప్.. నా జీవితం నీ వల్లే ఖరాబైంది.. ఆమె నువ్వు ట్రాన్సా అని అడిగింది: ఉప్పల్ బాలు వీడియో
Uppal Balu: ఉప్పల్ బాలు ఫైర్ అయ్యాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జి అయిన నవదీప్ పై తీవ్రంగా మండిపడ్డాడు. నీ వల్లే నా జీవితం ఖరాబైంది అంటూ.. నీకెందుకు రా అంటూ బూతులు తిడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
Uppal Balu: ఉప్పల్ బాలు తెలుసు కదా. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా తెలుగు వాళ్లకు సుపరిచితుడే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి అగ్నిపరీక్ష కోసం వచ్చిన అతనికి నవదీప్ షాకిచ్చాడు. స్టేజీపైనా అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. నీది చీప్ ఎంటర్టైన్మెంట్ అని అని అనడంతోపాటు అతన్ని సెలెక్ట్ చేయలేదు. దీంతో ఉప్పల్ బాలు బూతులు తిడుతూ నవదీప్ పై చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

నీది నువ్వు చూసుకోరా నవదీప్: ఉప్పల్ బాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం వెళ్లిన ఉప్పల్ బాలును ఈ షో ముగ్గురు జడ్జీలు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్ నో చెప్పారు. ఆ తర్వాత అతడు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
“హాయ్ గయ్స్ మీరు చూశారు కదా ఎపిసోడ్.. స్టేజీపైకి పిలిచారు ఒక టాస్క్ ఇవ్వలేదు.. పాడివ్వలేదు.. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్‌జెండరా అని ఆమె అడిగింది.. ఈయననేమో నీకు ఫ్యాన్స్ ఉన్నరా.. ఉన్నారని అనుకుంటున్నావా అని అన్నాడు.. మనుషులకు ఫ్యాన్స్ ఉండరా.. నువ్వు తోపువని నీకే ఉంటరా ఫ్యాన్స్.. ఇంత అవమానించడం మీరు చూశారు కదా.. నేను ఉన్నదే చెప్పాను.. అభిజీత్ గారు గ్రీన్ ఇవ్వబోతే రెడ్ ఇప్పించారు.. నీకెందు రా నవదీప్.. నీది నువ్వు చూసుకో.. నీ వల్లే నా జీవితం ఖరాబైంది.. నీకేం అన్యాయం చేశాను” అని ఆ వీడియోలో ఉప్పల్ బాలు నిలదీశాడు.
అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష శనివారం (ఆగస్ట్ 15) నుంచి ప్రారంభమైన విషయం తెలుసు కదా. అయితే హౌస్ లోకి వెళ్దామని ఆశతో వచ్చిన ఉప్పల్ బాలుకి అవమానం జరిగింది. స్టేజ్ పైకి తనను పిలిచిన తర్వాత తాను బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతో మంది తన ఫ్యాన్స్ మెసేజులు చేస్తున్నారని ఉప్పల్ బాలు చెప్పాడు.
దీనికి నవదీప్ స్పందిస్తూ.. అసలు నీకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారా.. ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా.. నీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అన్నది నా ఫీలింగ్ అని అన్నాడు. అటు బిందు మాధవి అయితే మీరు ట్రాన్స్‌జెండరా అని నేరుగా అడిగేసింది. మిమ్మల్ని హౌస్ లోకి పంపించడం మాకైతే ఇష్టం లేదంటూ నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ముగ్గురూ రెడ్ కార్డు చూపించారు.
నవదీప్‌పై ట్రోలింగ్
ఇది చూసిన తర్వాత సోషల్ మీడియాలో నవదీప్ పై ట్రోలింగ్ మొదలైంది. స్టేజీపైకి పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ కొందరు తీవ్రంగా మండిపడ్డారు. నవదీప్ పై ఇన్నాళ్లూ కాస్త మర్యాద ఉండేదని, ఇప్పుడది పోయిందని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మనుషులను మనుషుల్లాగా చూడండి.. స్టేజీపైకి పిలిచి ఇలా వ్యక్తిత్వ హననం చేస్తారా అంటూ మరొకరు వీడియో వదిలారు.
నిజానికి అంతకుముందు నుంచే నవదీప్, ఉప్పల్ బాలు మధ్య వార్ నడుస్తోంది. ఉప్పల్ బాలును ఇమిటేట్ చేస్తూ నవదీప్ చేసిన ఓ రీల్ కూడా బాగా వైరల్ అయింది. దీనిపైనా చాలా మంది అతనిపై నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ అగ్నిపరీక్ష ఎపిసోడ్ తో ఉప్పల్ బాలుకు మద్దతు మరింత పెరుగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


