Bigg Boss 10: ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? బిగ్ బాస్ 10లోకి రైతు బిడ్డ.. అగ్నిపరీక్షలో అదరగొట్టిన ఆడ పులి.. ఎవరంటే?
Bigg Boss 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కు టైమ్ దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 6న ఈ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌజ్ కు ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయినట్లు తెలిసింది. ఆ రైతు బిడ్డ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bigg Boss 10: తెలుగు టీవీ, ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ క్రేజీ షో కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.

బిగ్ బాస్ 10 తెలుగు
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న స్టార్ట్ కానుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై అనౌన్స్ మెంట్ వీడియోలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది.
రైతు బిడ్డ
బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి మెయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయిందనే ప్రచారం జోరందుకుంది. ఆమె ఎవరో కాదు.. సింగర్ ఝాన్సీనే. తన ఆటతో, పాటతో అదరగొడుతున్న ఈ రైతు బిడ్డ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో కనిపించబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఆడపులి
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష ఆడిషన్ కు వచ్చినప్పటి నుంచి సింగర్ ఝాన్సీ తన ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకుంటూనే ఉంది. తన పాటలతో, పొలం పనులతో పాపులర్ అయిన ఝాన్సీ బిగ్ బాస్ అగ్నపరీక్షలో కూడా టాస్క్ ల్లో అదరగొట్టింది. ఆడపిల్లను కాదు ఆడపులిని అని చెప్పుకొన్న ఝాన్సీ.. టాస్క్ ల్లో సత్తాచాటి ఆ మాటలు వంద శాతం నిజమనిపించింది.
ఫస్ట్ కంటెస్టెంట్
బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఎంపికైన ఫస్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ అని తెలిసింది. ఆమె హౌస్ లో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
సింగర్ ఝాన్సీ బ్యాక్ గ్రౌండ్
సింగర్ ఝాన్సీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆమెది సూర్యాపేట జిల్లా. చివ్వెం మండంలోని కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ స్వతహాగా పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జానపద పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పొలం పనులు చేస్తూ, పాటలు పాడుతూ ఆ వీడియోలు, వ్లాగ్ లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. చదువులోనూ ఝాన్సీ సూపర్ అనిపించింది. ఆర్గానికి కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


