Bigg Boss 10: జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో మిస్సింగ్.. ఈ స్టార్ కమెడియన్ల బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?

Bigg Boss 10: జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇద్దరు స్టార్ కమెడియన్లు కనిపించకపోవడం చర్చకు దారితీసింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసమే వాళ్లు షో నుంచి తప్పుకొన్నారనే ప్రచారం జోరందుకుంది. మరి ఈ ఇద్దరు కమెడియన్లు ఎవరు? అనేది ఇక్కడ చూసేయండి. 

Published on: Aug 26, 2026, 06:17:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' పదో సీజన్‌కు ముస్తాబవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని టాక్. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో మిస్సింగ్.. ఈ స్టార్ కమెడియన్ల బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో మిస్సింగ్.. ఈ స్టార్ కమెడియన్ల బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?

బిగ్ బాస్ 10 తెలుగు

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో స్టార్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, నరేష్ (పొట్టి నరేష్) కనిపించకపోవడంతో వీరు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి వెళ్లడం దాదాపు ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది.

​జబర్దస్త్ ప్రోమో తెచ్చిన అనుమానాలు

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కొత్త ప్రోమో విడుదలైంది. ఎప్పుడూ తన పంచ్‌లతో నవ్వించే ఆటో రామ్ ప్రసాద్, తనదైన కామెడీతో అలరించే పొట్టి నరేష్ ఈ లేటెస్ట్ ప్రోమోలో ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తమ మిగతా ప్రాజెక్టుల షూటింగ్స్‌కు బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు రామ్ ప్రసాద్, నరేష్ కూడా అదే కారణంతో జబర్దస్త్ షూటింగ్‌కు దూరంగా ఉన్నారని బుల్లితెర వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

బిగ్‌బాస్ సెంటిమెంట్

బిగ్‌బాస్ షోలో కేవలం గొడవలు, టాస్క్‌లు మాత్రమే కాకుండా ప్రేక్షకులు వినోదాన్ని కూడా కోరుకుంటారు. అందుకే మేకర్స్ ప్రతి సీజన్‌లోనూ జబర్దస్త్ కమెడియన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి నటులు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి పదో సీజన్ కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచేందుకు రామ్ ప్రసాద్‌ను ముందుగానే ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు నరేష్ కూడా జతకలిశాడనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.

టైమింగ్ కింగ్ రామ్ ప్రసాద్

ఆటో రామ్ ప్రసాద్ తన ఆటో పంచ్‌లతో, నవ్వించే రైటింగ్ తో బుల్లితెరపై చెరగని ముద్ర వేశారు. మరోవైపు గుంటూరుకు చెందిన పొట్టి నరేష్ శారీరక లోపాన్ని, సమాజం నుంచి ఎదురైన ఛీత్కారాలను జయించి జబర్దస్త్ వేదికపై నిలబడ్డారు. తన పట్టుదలతో టీమ్ లీడర్‌గా ఎదిగి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఈ ఇద్దరు పక్కా కామెడీ టైమింగ్ ఉన్న నటులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే ప్రేక్షకులకు వినోదం పంచడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More