Jabardasth Actor: శ్మశానంలో ప్రపోజల్ ఏంటి భయ్యా? మరీ డిఫరెంట్ గా జబర్దస్త్ నటుడు-అమ్మాయి ఓకే చెప్పిందా? అసలు ఏమైంది?
Jabardasth Actor: ప్రియురాలికి ప్రేమను తెలపాలంటే మంచి ప్లేస్, వెకేషన్ కోసం అబ్బాయిలు వెయిట్ చేస్తుంటారు. ప్రపోజ్ చేసేందుకు చాలా అరెంజ్ మెంట్స్ చేసుకుంటారు. కానీ ఈ జబర్దస్త్ నటుడు మాత్రం చాలా డిఫరెంట్ గా తన ప్రేయసికి శ్మశాన వాటికలో ప్రపోజ్ చేశాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ నటుడు ఎవరు? అనేది చూసేయండి.
Jabardasth Actor: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ రాకేష్, వ్యాఖ్యాత జోర్దార్ సుజాత (Jordar Sujatha). టీవీ షోలలో తనదైన తెలంగాణ యాస, నటనతో ఆకట్టుకున్న జోర్దార్.. అదే షో ద్వారా కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) తో పరిచయం పెంచుకుని, ఆపై ప్రేమలో పడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

రాకింగ్ రాకేష్, సుజాత లవ్ స్టోరీ
తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమకథ ఎలా మొదలైంది, పెళ్లికి ముందు వచ్చిన సవాళ్లు, ప్రస్తుత వైవాహిక జీవితంపై సుజాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో సుజాత స్కిట్లు చేయడం ప్రారంభించిన సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది.
శ్మశాన వాటికలో
మొదట్లో కేవలం కో-ఆర్టిస్టులుగా పనిచేశామని, రాకేష్ ఇచ్చిన ప్రోత్సాహం, కేరింగ్ తత్వమే తమను దగ్గర చేసిందని సుజాత వెల్లడించారు. నిరంతరం కలసి ప్రయాణించడం, కష్టసుఖాలను పంచుకోవడంతో వీళ్ల మధ్య స్నేహం ప్రేమగా మారింది. అయితే రాకేష్ ఏమో డిఫరెంట్ గా సుజాతకు శ్మశాన వాటికలో ప్రపోజ్ చేశాడు.
కామెడీ అనుకున్నా
‘‘ఒక రోజు రాత్రి రాకేష్ నన్ను శ్మశాన వాటికకు తీసుకెళ్లాడు. అక్కడికి ఎందుకు వెళ్లామో నాకు అర్థం కాలేదు. కానీ రాకేష్ మాత్రం నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే అప్పుడు అతని మాటలను జోక్ గా అనుకున్నా. అందుకే సీరియస్ గా తీసుకోలేదు’’ అని సుజాత వెల్లడించింది.
ఇంట్లో వాళ్లను ఒప్పించి
రాకేష్ మాత్రం సుజాతను పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ‘‘నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. రాకేష్ ఫోన్ లాక్కొని ‘మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. అప్పుడు నేను ఏదో ఒకలాగా కవర్ చేశా. కానీ ఒక రోజు వాళ్లింటికి తీసుకెళ్లాడు. అప్పుడు తన ప్రేమను చెప్తుంటే సీరియస్ అనిపించింది.
నన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో వాళ్లందరినీ రాకేష్ ముందే ఒప్పించాడు. ఆ తర్వాతా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడాడు. అలా మా పెళ్లి జరిగింది’’ అని సుజాత తమ లవ్ స్టోరీని గుర్తు చేసుకుంది.
సేవ్ ది టైగర్స్
జోర్దార్ సుజాతగా పాపులర్ అయిన సుజాత.. జబర్దస్త్, బిగ్ బాస్ తో ప్రజలకు ఇంకా చేరువైంది. ఆ తర్వాత జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ తో ఇంకా క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు రాకేష్ ఏమో బజర్దస్త్, కుకూ విత్ జాతిరత్నాలు షోలు చేస్తున్నాడు. సినిమాల్లో నటిస్తున్నాడు. వీళ్లకు ఓ పాప ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


