Samantha: స్టేజీపైకి దూసుకొచ్చిన ఫ్యాన్-భర్త మాట్లాడుతుండగా సమంతకు ప్రపోజ్-అందరూ షాక్-ఆ తర్వాత హీరోయిన్ ఏం చేసిందంటే?
Samantha: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత.. ఇప్పుడు మా ఇంటి బంగారంతో కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Samantha: మా ఇంటి బంగారం అంటూ మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెడీ అయిపోయింది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సమంతకు ప్రపోజ్
మా ఇంటి బంగారం ట్రైలర్ సోమవారం (మే 25) రిలీజ్ అయింది. ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్టేజీపై సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ దూసుకొచ్చాడు. మోకాళ్లపై కూర్చుని సమంతకు పువ్వులతో ప్రపోజ్ చేశాడు. అది చూసి రాజ్ నిడిమోరు మాట్లాడటం ఆపేశాడు. పక్కనే ఉన్న శ్రీముఖి, డైరెక్టర్ నందిని రెడ్డి కూడా కంగారు పడ్డారు.
ఫ్యాన్ తో సెల్ఫీ
స్టేజీ పైకి ఒక్కసారిగా ఫ్యాన్ దూసుకురావడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతణ్ని తీసుకెళ్లాలని చూశారు. కానీ ఆ అభిమాని ఒక్క సెల్ఫీ అడగడంతో సమంత ఓకే అని చెప్పింది. ఆ ఫ్యాన్ తో సెల్ఫీ దిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మనసు కూడా బంగారం
సమంత సినిమా టైటిలే కాదు మనసు కూడా బంగారం అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. స్టేజీపైకి వచ్చిన అభిమానితో నవ్వుతూ మాట్లాడిన సమంత.. సెల్ఫీ కూడా ఇవ్వడం ఎంతో స్పెషల్ అని అంటున్నారు. ఇక ఇదే ఈవెంట్లో ఓ వయసు పైబడ్డ బామ్మతోనూ సమంత ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది.
మా ఇంటి బంగారం
ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. కానీ కొంతకాలంగా డైరెక్ట్ గా తెలుగు మూవీలో లీడ్ రోల్ ప్లే చేయలేదు. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్ ను మరోసారి అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని సమంత చూస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్టర్.
రిలీజ్ డేట్
సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది. ఫస్ట్ ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. ఐపీఎల్ 2026 కారణంగా ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


