Samantha: హీరో అంటే మగాళ్లేనా? వెన్నెల కిశోర్ కు సమంత కౌంటర్లు..మా ఇంటి బంగారం ప్రమోషనల్ వీడియో వైరల్..ఓవర్ రేటెడ్ అంటూ

Samantha: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత గ్యాప్ తర్వాత పూర్తిస్థాయిలో తెలుగు ఫీచర్ ఫిల్మ్ చేస్తోంది. ‘మా ఇంటి బంగారం’ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లను సమంత డిఫరెంట్ గా స్టార్ట్ చేసింది. వెన్నెల కిశోర్, సమంత వీడియో వైరల్ గా మారింది.

Published on: Apr 26, 2026, 05:58:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు మళ్ళీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘నాట్ ఏ ప్రమోషనల్ ఇంటర్వ్యూ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో వెన్నెల కిశోర్ హోస్ట్‌గా వ్యవహరించగా, సమంత తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.

సమంత, వెన్నెల కిశోర్ (x/TralalaPictures)
సమంత, వెన్నెల కిశోర్ (x/TralalaPictures)

హీరో అంటే కేవలం మగాళ్లేనా?

సమంత, వెన్నెల కిశోర్ ప్రమోషనల్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో హీరో ఎవరు? అని వెన్నెల కిశోర్ అడుగుతాడు. మీరు హీరోయిన్ కదా అని అంటాడు. వెంటనే ‘హే సిరి హీరో అంటే ఎవరో చెప్పు’ అని ఫోన్లో సమంత అడగుతుంది.

‘‘ధైర్యం, గొప్ప ఆశయాలు ఉండి ఎదుటివారికి స్ఫూర్తినిచ్చే ఎవరైనా హీరోనే అని, ఇది జెండర్ న్యూట్రల్ పదం’’ అని సిరి చెప్తుంది. ఈ సినిమాలో తనే హీరో అని గర్వంగా చెప్పుకుంటూ వెన్నెల కిశోర్ నోరు మూయించింది సమంత.

రాజ్ అండ్ డీకే నుంచి 'ఓ బేబీ' వరకు..

తన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాల గురించి కూడా సమంత ఈ సందర్భంగా మాట్లాడింది. రాజ్ అండ్ డీకే వంటి గొప్ప దర్శకులతో పనిచేయడం తనకెంతో ఇష్టమని తెలిపింది. అయితే వెన్నెల కిశోర్ మాత్రం ఎప్పటిలాగే తన వెటకారంతో.. "చాలా బోరింగ్ సమాధానాలు చెప్తున్నావ్, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పు" అంటూ ఆటపట్టించడం ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచింది.

మా మీద సినిమా

మా ఇంటి బంగారం పేరులోని ‘మా’ను ఉద్దేశించి.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa- మా) మీద సినిమా తీస్తున్నారు కదా పర్మిషన్ తీసుకున్నారా? అని వెన్నెల కిశోర్ అడిగాడు. మా ఇంటి బంగారం అనేది మా ఇల్లు, మీ ఇల్లు అనే అర్థంలో వస్తుంది, మీకు బేసిక్ తెలుగు కూడా రాదా? అని సమంత మండిపడుతుంది. సమంత పూర్తిగా సమాధానాలు చెప్పకముందే వెన్నెల కిశోర్ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.

సొంత నిర్మాణ సంస్థ

సమంత ఈ సినిమాను తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) పై నిర్మిస్తోంది. ఈ పేరు వినడానికి చాలా ఫన్నీగా ఉందని వెన్నెల కిశోర్ ఆటపట్టిస్తుంటే, అది ఎంతో పాజిటివ్ గా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. సినిమా కోసం తను పడ్డ కష్టం, తీసుకున్న డైట్, యాక్షన్ సీక్వెన్స్ కోసం చేసిన వర్క్‌షాప్స్ గురించి కూడా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మే 15న రిలీజ్

మా ఇంటి బంగారం మూవీ మే 15వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇంటర్వ్యూ చివర్లో వెన్నెల కిశోర్ ను ఒక ఓవర్‌రేటెడ్ యాక్టర్‌గా సమంత పేర్కొంది. మొత్తానికి ఈ ఫన్నీ ఇంటర్వ్యూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సమంత మార్క్ యాక్షన్, ఎమోషన్ చూడాలంటే మే 15 వరకు ఆగాల్సిందే!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More