మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. గ్యాప్ తర్వాత సమంత మూవీ.. రిలీజ్ డేట్ ఇదే.. భర్త ఇచ్చిన కథతో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. 

Published on: Feb 22, 2026, 15:48:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో సాగిపోయింది సమంత రూత్ ప్రభు. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. 2023లో రిలీజైన ఖుషీ తర్వాత సమంత తెలుగులో మళ్లీ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ రివీల్ చేశారు.

మా ఇంటి బంగారం పోస్టర్ లో సమంత (instagram-Samantha)
మా ఇంటి బంగారం పోస్టర్ లో సమంత (instagram-Samantha)

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్

కొంత కాలం గ్యాప్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ (ఫిబ్రవరి 22) అనౌన్స్ చేశారు. వేసవి కానుకంగా ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు. సామ్ డైరెక్ట్ తెలుగు మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇది గుడ్ న్యూస్.

బంగారాలు

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఓ స్పెషల్ పోస్టర్ పంచుకుంది. ఇందులో ఆమె హోమ్లీగా కనిపించింది. ‘‘ఈ సమ్మర్ ల థియేటర్లలో కలుద్దాం బంగారాలు. మా ఇంటి బంగారం ప్రపంచవ్యాప్తంగా మే 15, 2026న గ్రాండ్ గా రిలీజ్ కానుంది’’ అని సమంత ఇన్ స్టాలో పేర్కొంది.

భర్త కథతో

సమంత హీరోయిన్ గా నటించడమే కాకుండా మా ఇంటి బంగారం మూవీకి ఆమెనే నిర్మాత కూడా. త్రలాల మూవింగ్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందంచాడు. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఇప్పటికే మా ఇంటి బంగారం మూవీ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో సమంత రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది.

ఓ వైపు ఇంట్లో కోడలిగా పద్ధతిగా ఉండే సామ్.. బయట యాక్షన్ తో గూండాల పని పడుతుంది. అమాయకంగా నటిస్తూనే ఫైటింగ్ సీన్స్ లో యాక్షన్ మోడ్ లోకి సమంత వెళ్లిపోయింది. మా ఇంటి బంగారం మూవీ సమంతకు మంచి కమ్ బ్యాక్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More