Bigg Boss 10 Nominations: బిగ్ బాస్ 10 తెలుగు నామినేషన్స్‌లో మొత్తం 10 మంది- ఆ నలుగురు మాత్రం సేఫ్- ఎవరు వర్సెస్ ఎవరు?
Bigg Boss Telugu 10 Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో అసలు ఆట మొదలైంది. ఈ వారం తొలిసారిగా కంటెస్టెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో బిగ్ బాస్ 10 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరో తెలుసుకుందాం.
Bigg Boss 10 Telugu Nominations Second Week: టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేస్తున్న తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి సీజన్ 10తో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.

రెండు రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్
వారం కాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ రెండు రోజుల గ్యాప్‌తో ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో బిగ్ బాస్ హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే, గత వారం 16 మంది డైరెక్ట్ నామినేషన్స్‌లోకి వచ్చారు.
గత వారం దశావతారం పేరుతో ఒక్కో టాస్క్‌లు ఇచ్చారు. ఆ టాస్క్‌లు ఆడి కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌గా మారే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్‌మేట్స్ కానీ వారు నాన్ రిస్క్, హై రిస్క్‌లలో ఉన్నారు. ఇక వీకెండ్స్ వచ్చేసరికి అంటే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌గా మారారు.
ఈవారమే నామినేట్ చేసుకునేలా
గతవారం వారు హౌజ్‌మేట్స్ కాకపోవడంతో నామినేట్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. కానీ, ఈసారి వారంతా హౌజ్‌మేట్స్ కావడంతో ఈ వారం ఒకరినొకరు నామినేట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. తమకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేసేందుకు టాస్క్ కూడా ఆడించాడు బిగ్ బాస్.
అదే రోప్ టాస్క్. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్స్‌కు తాళ్లు చుట్టి ఉంటాయి. సరైన దారిలో వెళ్లి ఆ పోల్స్‌కు ఉన్న రోప్స్ త్వరగా తీసిన వారికి ఇతర కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే పవర్ వస్తుంది. ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ పోటీ పడుతుంటారు.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది
ఈ నామినేషన్ టాస్క్ పోటీలో యాంకర్ సుధీర్-సింగర్ ఝాన్సీ, వర్షిణి సౌందరరాజన్-రోహిత్ నాయుడు, సృష్టి వ్యాకరణం-జబర్దస్త్ నరేష్, కృష్ణుడు-దేబ్జానీ మోదక్ తదితర జంటలు పాల్గొన్నాయి. అలా అందరు బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం నామినేషన్స్‌లో పాల్గొన్నారు.
ఇక టాస్క్ పూర్తయ్యేసరికి బిగ్ బాస్ తెలుగు 10 ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూట్ పూర్తయిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్ 10 రెండో వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల కూడా చేశారు మేకర్స్.
ఆ నలుగురు మాత్రం సేఫ్
ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 నామినేషన్స్‌లో హీరో త్రిగుణ్, రోహిత్ నాయుడు, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, నటుడు కృష్ణుడు, సింగర్ ఝాన్సీ, సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్, కామనర్ శాలిని పటేల్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, సృష్టి వ్యాకరణం, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పది మంది ఉన్నారు.
అయితే, ఈ వారం నామినేషన్స్ నుంచి నలుగురు మాత్రం తప్పించుకుని సేఫ్‌గా ఉన్నారు. కామనర్ అమన్ మసూద్, జబర్దస్త్ నరేష్, టెంపర్ వంశీ, యాంకర్ సుధీర్ రెడ్డి నలుగురు బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం నామినేషన్స్ నుంచి సేఫ్‌గా ఉన్నారు.
ఎవరెవరి మధ్య మాటల యుద్ధం
కాగా, ఈ నామినేషన్స్‌లో రోహిత్ వర్సెస్ త్రిగుణ్, సుధీర్ వర్సెస్ త్రిగుణ్, ఝాన్సీ వర్సెస్ రోహిత్, ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ మాటల యుద్ధం గట్టిగా జరిగిందని బిగ్ బాస్ వర్గాల సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


