Bigg Boss 10: నాగార్జున ముందే ముఖేష్ ఇష్టమని చెప్పిన హీరోయిన్- అక్కడ, ఇక్కడ పులిహార కలుపుతాడు కానీ నా దగ్గరికి రాడంటూ!

Bigg Boss Telugu 10 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 10 ఈరోజు ఎపిసోడ్‌లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తారు. అనంతరం హార్ట్ క్లోజ్, హార్ట్ బ్రేక్ టాస్క్ ఆడించాడు నాగార్జున. అనంతరం హోస్ట్ నాగార్జున ముందే గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ అంటే ఇష్టమని మనసులో మాట బయటపెట్టింది హీరోయిన్.

Published on: Sep 13, 2026, 12:54:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 September 13th Episode Highlights: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ సీజన్ 10 జోరుగా సాగుతోంది. ఇప్పటికే వీకెండ్‌లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 12) హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇచ్చి కొందరికి వార్నింగ్ ఇచ్చాడు.

నాగార్జున ముందే ముఖేష్ ఇష్టమని చెప్పిన హీరోయిన్- అక్కడ, ఇక్కడ పులిహార కలుపుతాడు కానీ నా దగ్గరికి రాడంటూ!
నాగార్జున ముందే ముఖేష్ ఇష్టమని చెప్పిన హీరోయిన్- అక్కడ, ఇక్కడ పులిహార కలుపుతాడు కానీ నా దగ్గరికి రాడంటూ!

ట్రెడిషనల్ లుక్‌లో హోస్ట్ నాగార్జున

ఇక ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్‌లో కూడా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. వినాయక చవితి సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో నాగ్ ఆకట్టుకున్నారు. అనంతరం హౌజ్‌లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేశారు.

శనివారం ఎపిసోడ్‌లో మధ్యలో ఆపేసిన హార్ట్, హార్ట్ బ్రేక్ టాస్క్ ఆడించాడు నాగార్జున. హార్ట్ సైడ్ ఉన్న వాళ్లు దగ్గరిగా ఉండాలని, హార్ట్ బ్రేక్‌లో పెట్టినవాళ్లు దూరంగా ఉంచాలని అనుకునే టాస్క్ అది. సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్‌ను జబర్దస్త్ రామ్ ప్రసాద్ హార్ట్‌కి క్లోజ్ అని చెప్పి.. శాలిని పటేల్‌ని హార్ట్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నట్లు చెప్పాడు.

రెండు రోజులు బుర్ర పాడైపోయిందా

"రామ్ ప్రసాద్ గారు మీ ఆటో పంచ్‌లకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్యూ అన్నయ్య అంది. నైట్‌కే నాట్ టాకింగ్ టు యూ.. అని మొహం మీద వేలు పెట్టి చూపించింది" అని శాలిని గురించి రామ్ ప్రసాద్ చెప్పాడు. "కనీసం రెండు రోజులు నీ బుర్ర పాడైపోయింది కదా" అని నాగార్జున అన్నాడు.

తర్వాత నటుడు కృష్ణుడు కూడా దేబ్జానీని హృదయానికి దగ్గరిగా ఉంచుతాడు. తన ప్యూర్ హార్ట్‌తో మాత్రం నాకు బ్రెయిన్‌లెస్ అనే ట్యాగ్ ఇచ్చిందని చెబుతాడు. అనంతరం సృష్టిని జబర్దస్త్ నరేష్ హార్ట్‌కు దూరంగా పెడతాడు. "సరిగ్గా గంట కూడా మాట్లాడలేం. ఇలా అయినా దారులు ఒక్కటవుతాయేమో అని ఇది ఇస్తున్నాను" అని నరేష్ చెప్పాడు.

నీకు ఎంత మెడనొప్పి వస్తుందో

"నేను ఆలోచిస్తున్నా నరేష్.. ఒక్క గంట సేపు సృష్టితో నువ్వు మాట్లాడితే నీకు ఎంత మెడనొప్పి వచ్చి ఉంటుంది" అని నాగ్ జోక్ వేశాడు. తర్వాత రోహిత్‌ను హృదయానికి దూరంగా ఉంచుతూ.. "మొదట యాక్సెప్టెన్సీనే లేదు. నోరు జారి మాట్లాడతాడు. అది నాకు నచ్చలేదు సర్" అని గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ అంటాడు.

దాంతో హౌజ్ సీరియస్‌గా మారిపోతుంది. "ముఖేష్ నీ గురించి ఒక విషయం చెప్పాలి.. " అని సీరియస్‌గా అన్న నాగ్ తర్వాత "నీ కళ్లు చాలా బాగుంటాయి" అని అంటాడు. దాంతో అంతా చప్పట్లు కొడతారు. "థ్యాంక్యూ సర్. మీరు చెబుతున్నారు అందుకు చాలా హ్యాపీగా ఉంది" అని ముఖేష్ గౌడ అంటాడు.

నాకు చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా

"ఏ దేబ్జానీ చెప్పినప్పుడు నమ్మలేదా" అని నాగార్జున అడిగాడు. "నాకు నిజంగా నీ కళ్లు చాలా బాగుంటాయనిపించింది కాబట్టే చెప్పాను" అని దేబ్జానీ మోదక్ అంటుంది. "థ్యాంక్యూ నీది కూడా చాలా బాగుంటుంది" అని ముఖేష్ కాంప్లిమెంట్ ఇస్తాడు.

"సర్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముఖేష్ చాలా ఇష్టం కానీ చెప్పలేకపోతున్నాను" అని ముఖేష్ చేయి పట్టుకుని సోఫాలోనుంచి లేపుతుంది దేబ్జానీ. దానికి హౌజ్ కంటెస్టెంట్స్, ఆడియెన్స్ అంతా చప్పట్లు కొడుతూ నవ్వుతారు. నాగార్జున నోరెళ్లబెట్టి ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తాడు.

ముఖేష్‌పై ఉన్న ప్రేమ బయటపెట్టిన దేబ్జానీ

"ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు.. అటు సైడ్ కూడా పులిహోర చేస్తున్నాడు (వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికి వెళ్లి పులిహోర కలుపుతున్నాడు).. నా దగ్గరికి మాత్రం రావట్లేదు సర్" అని ముఖేష్‌పై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను నాగార్జున ముందే చెప్పేసింది సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్. అరే అరే అంటూ నాగార్జున తెగ నవ్వాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More