Bigg Boss Telugu 10 Elimination: వారం కాకముందే బిగ్ బాస్ నుంచి రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్- రేపు మరొకరు అవుట్-ఎవరంటే?

Bigg Boss Telugu 10 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో ఊహించని విధంగా రెండుసార్లు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ జరిగాయి. దాంతో రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. వారిలో ఒకరు కామనర్ అయితే, మరొకరు సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎలిమినేట్ అయింది. రేపు మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

Published on: Sep 12, 2026, 12:50:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 Elimination This Week: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి రోజు నుంచే జోరుగా సాగిపోతుంది. మొదటి వారం పూర్తి కాకముందే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఊహించని విధంగా జరిగిన ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో ఒకరు కామనర్, మరొకరు సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు.

వారం కాకముందే బిగ్ బాస్ నుంచి రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్- రేపు మరొకరు అవుట్-ఎవరంటే?
వారం కాకముందే బిగ్ బాస్ నుంచి రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్- రేపు మరొకరు అవుట్-ఎవరంటే?

హై రిస్క్‌లో చైత్ర రాయ్

మొదటి వారం పూర్తి కాకముందే రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా రికార్డుకెక్కింది. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో బ్లూ అండ్ రెడ్ టీమ్స్‌కి టాస్క్ ఇచ్చారు. దాంట్లో రెడ్ టీమ్ విన్ అయి సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్‌ను హై రిస్క్‌లో పెట్టారు రోహిత్, టెంపర్ వంశీ.

అలాగే, రోహిత్, టెంపర్ వంశీ హౌజ్‌మేట్స్ అయ్యారు. అంతకుముందు హై రిస్క్‌లో రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ్ ఉన్నారు. దాంతో ముగ్గురు హై రిక్స్ కంటెస్టెంట్స్ మధ్య ఎవరు సేవ్ అవ్వాలో నిర్ణయించుకోమని బిగ్ బాస్ చెప్పాడు. చాలా సేపు డిస్కషన్స్ తర్వాత రామ్ ప్రసాద్, చరణ్ కలిసి చైత్ర రాయ్‌ను ఎలిమినేష్ ప్రక్రియ నుంచి సేవ్ చేశారు.

చరణ్ మహాదేవ్ ఎలిమినేట్

కానీ, చైత్ర రాయ్ ఇంకా హై రిస్క్‌లోనే ఉన్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ్ ఇద్దరి మధ్య హౌజ్ కంటెస్టెంట్స్‌తో ఎలిమినేట్ ఎవరు అవ్వాలో ఓటింగ్ పెట్టారు. అందులో రామ్ ప్రసాద్ ఉండాలని ఏకంగా 10 ఓట్లు పడ్డాయి. చరణ్‌కు మాత్రం నాలుగు ఓట్లు వచ్చాయి. దాంతో కామనర్‌గా వచ్చిన చరణ్ మహాదేవ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.

తర్వాతి రోజు అయిన బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో మహా పరీక్ష కొనసాగుతుందని, ఈజీ టాస్క్స్ ఎవరు, హార్డ్ టాస్క్‌లు ఎవరు చేస్తారో నిర్ణయించుకోమని అనౌన్స్‌మెంట్ వచ్చింది. హార్డ్ టాస్క్‌కు వారి వాదనలు విని అంతా కలిసి యాంకర్లు వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డిని దింపారు.

రెండ్రోజుల్లో ఇద్దరు అవుట్

కానీ ఆ హార్డ్ టాస్క్‌లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. దాంతో ఇద్దరు హై రిస్క్‌లోకి వెళ్లారు. ఇక హై రిస్క్‌లో ఉన్న చైత్ర రాయ్, వర్షిణి, సుధీర్‌కు ఎలిమినేషన్ ఓటింగ్‌ను వారిలోనే పెట్టాడు బిగ్ బాస్. వర్షిణి, సుధీర్ ఇద్దరు కలిసి చైత్ర రాయ్‌ను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దాంతో చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

అలా రెండు రోజుల్లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో భాగంగా కామనర్ చరణ్ మహాదేవ్, సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే, వీరు రీ ఎంట్రీ కూడా ఇస్తారని ఒక టాక్ నడుస్తోంది. ఇక రేపు (సెప్టెంబర్ 13) అంటే ప్రతి వారం జరిగే ఎలిమినేషన్‌లో భాగంగా మరొకరు కూడా ఎలిమినేట్ కానున్నారు.

అతనే ఎలిమినేట్ అవుతాడంటూ

ఆడియెన్స్ వేసే బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం అధిక ఓట్స్‌తో టాప్ 1గా రోహిత్ ఉండగా.. చివరి మూడు స్థానాల్లో యాంకర్లు వర్షిణి సౌందర రాజన్, సుధీర్ రెడ్డి, నటుడు కృష్ణుడు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వీకెండ్ ఎలిమినేషన్‌లో యాక్టర్ కృష్ణుడు 99 శాతం ఎలిమినేట్ అవుతాడని పోల్స్ చెబుతున్నాయి. మరి చూడాలి రేపు ఎలాంటి ట్విస్టులు బిగ్ బాస్ తెలుగు 10లో చోటు చేసుకుంటాయనేది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More