Bigg Boss Powers: బిగ్ బాస్ తెలుగులో పదిమందికి 10 మ్యాజికల్ పవర్స్- గేమ్ మార్చేసే అస్త్రాలు- ఆ ఒక్కడికి మాత్రం అలా!

Bigg Boss Telugu 10 September 7 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్లలో పదిమందికి 10 మ్యాజికల్ పవర్స్‌ను ఇచ్చారు. ఆ పవర్స్ గేమ్ మార్చేలా ఉన్నాయి. మరి ఎవరికి ఎలాంటి సూపర్ పవర్ వచ్చిందో బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 7 ఎపిసోడ్ హైలెట్స్‌లో తెలుసుకుందాం.

Published on: Sep 8, 2026, 10:57:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 Magical Powers To 10 Contestants: బిగ్ బాస్ 10 తెలుగు మొదటి రోజే రసవత్తరంగా సాగింది. తొలిరోజునే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో మ్యాజికల్ పవర్స్ ఇచ్చే కీస్ గురించి చర్చ మొదలైంది.

బిగ్ బాస్ తెలుగులో పదిమందికి 10 మ్యాజికల్ పవర్స్- గేమ్ మార్చేసే అస్త్రాలు- ఆ ఒక్కడికి మాత్రం అలా!
బిగ్ బాస్ తెలుగులో పదిమందికి 10 మ్యాజికల్ పవర్స్- గేమ్ మార్చేసే అస్త్రాలు- ఆ ఒక్కడికి మాత్రం అలా!

10 మందికి మ్యాజికల్ పవర్స్

బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంచ్ రోజున టాస్కుల్లో గెలిచి 8 మంది ఆ మ్యాజికల్ పవర్ కీస్ గెలుచుకున్నారు. మిగతా ఇద్దరికి రెండు కీస్ నిర్ణయించి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడి. చాలా సేపు వాగ్వాదం, గొడవ తర్వాత టెంపర్ వంశీ, నటుడు కృష్ణుడికి ఆ తాళం చెవులు ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చారు.

ఇతరులకు చెప్పొద్దు

ఆ తర్వాత పదిమంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి పేరును బిగ్ బాస్ చెప్పడంతో వారు వెళ్లి ఆ పవర్ ఏంటో తెలుసుకున్నారు. కానీ, ఆ పవర్ ఏంటనేది మరే ఇతర కంటెస్టెంట్‌కు చెప్పినా, తెలిసిన దాన్ని కోల్పోతారని బిగ్ బాస్ మెలిక కూడా పెట్టాడు.

  1. త్రిగుణ్ మ్యాజికల్ పవర్

మొదట త్రిగుణ్ పేరు చెప్పడంతో వెళ్లి తనకు వచ్చిన మ్యాజికల్ పవర్ లాక్ ఓపెన్ చేసి చూశాడు. స్టీల్ ద అదర్ పవర్ శక్తి త్రిగుణ్‌కు వచ్చింది. అంటే ఇతరులకు వచ్చిన శక్తిని తీసుకుని తనకు నచ్చినట్లుగా వాడుకునే పవర్‌ను పొందాడు హీరో త్రిగుణ్.

2. సింగర్, కామనర్ ఝాన్సీకి వచ్చిన శక్తి

సింగర్ ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే శక్తి లభించింది. అయితే, అది కేవలం ప్రారంభంలో అంటే మొదటి వారంలో కేవలం తను ఎలిమినేట్ అవుతానని భయం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని కండిషన్ ఉంది.

3. ముఖేష్ గౌడ మ్యాజికల్ పవర్

గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడకు రివైవ్ ది యూజ్‌డ్ పవర్ అని వచ్చింది. అంటే, ఇతరులు వాడిని పవర్‌ను మళ్లీ బతికించి అది మొదటగా వచ్చిన ఒరిజినల్ ఓనర్ కంటెస్టెంట్ ఉన్నారో వారికి ఇవ్వొచ్చు. మొదట ఆ పవర్‌కి ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాగే ఉంటాయి.

4. వర్షిణి పవర్

యాంకర్ వర్షిణి సౌందరరాజన్‌కి గ్రాబ్ ఎనీ విన్ అనే మ్యాజికల్ పవర్ వచ్చింది. అంటే, ఏదైనా టాస్కుల్లో ఇతరులు గెలిస్తే ఆ విజయాన్ని తన విజయంగా తీసుకునే శక్తి అది.

5. కృష్ణుడికి వచ్చిన శక్తి

యాక్టర్ కృష్ణుడుకి కంటెస్టెంట్ల స్థానాలను స్వాప్ అంటే మార్చుకునే పవర్ లభించింది. ఏదైనా సమయంలో ఒకరి స్థానంలోకి తను వెళ్లాలనుకున్నా, తనకు ఇష్టమైన వాళ్లను పంపించాలనుకున్న ఈ శక్తిని ఉపయోగించవచ్చు.

6. శాలిని మ్యాజికల్ పవర్

కామనర్ శాలిని పటేల్‌కు పవర్ టు అసైన్ ఎనీ హౌజ్ డ్యూటీ అనే శక్తి వచ్చింది. అంటే, హౌజ్‌లో ఒక కంటెస్టెంట్ ఉన్నంతకాలం వారు ఏ పని చేయాలో శాలిని ఆర్డర్ వేయొచ్చు. ఒక్కసారి శాలిని చెప్పిన ఆ పనిని ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేంతవరకు చేయాల్సిందే.

7. సృష్టి వ్యాకరణం పవర్

మరో కామనర్ శివ సృష్టి వ్యాకరణంకు ఏ ఇతర కంటెస్టెంట్‌ను అయినా ఎప్పుడైనా డైరెక్ట్ నామినేట్ చేసే శక్తి లభించింది. అంటే, సృష్టి ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు. దాంతో వారు నెక్ట్స్ వచ్చే నామినేషన్స్‌లో ఎలాంటి ఓట్ పడకున్నా ఉంటారు.

8. రామ్ ప్రసాద్ పవర్

జబర్దస్త్ రామ్ ప్రసాద్‌కి సేఫ్ షీల్డ్ మ్యాజికల్ పవర్ వచ్చింది. దీని ద్వారా నామినేషన్స్ నుంచి ఏ ఒక్కరినైనా లేదా తనను అయినా సేవ్ చేసుకోవచ్చు. దీంతో ఎలిమినేషన్ నుంచి ఒక వారం బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

9. టెంపర్ వంశీకి వచ్చిన శక్తి

టెంపర్ వంశీకి పవర్ టు బ్లాక్ కెప్టెన్సీ అనే శక్తి వచ్చింది. దీన్ని ఉపయోగించి ఏ ఒక్క కంటెస్టెంట్‌ను అయినా కెప్టెన్సీ రేసు నుంచి బ్లాక్ చేసి అడ్డుకోవచ్చు. అయితే, ఇలా కేవలం 2 వారాలు మాత్రమే కెప్టెన్సీని టెంపర్ వంశీ అడ్డుకోవచ్చు.

10. జబర్దస్త్ నరేష్ పవర్

జబర్దస్త్ నరేష్‌కి 2x వోట్స్ పవర్ దక్కింది. దీని ద్వారా నామినేషన్స్‌లో ఓట్లు పడిన కంటెస్టెంట్‌కు రెట్టింపు ఓట్లు పెరిగేలా చేయొచ్చు. అంటే, ఒకరికి 2 నామినేషన్ ఓట్లు పడినప్పుడు ఈ పవర్ ఉపయోగిస్తే నాలుగు ఓట్లుగా పరిగణిస్తారు.

నరేష్‌కు అర్థం కానీ శక్తి

అయితే, మిగతా తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌కు తమ పవర్ అర్థమైంది. కానీ, ఒక్క జబర్దస్త్ నరేష్‌కు మాత్రం అర్థం కాలేదు. ఆ డబుల్ వోట్స్ అనేది తనకు వ్యతిరేకంగా పడినప్పుడు ఉపయోగించాలా లేదా ఇతరులకు వ్యతిరేకంగా పడినప్పుడు వాడాలా అనేది తెలియట్లేదని నరేష్ టెన్షన్ పడ్డాడు.

ఎప్పుడు ఉపయోగించాలనేది

దాంట్లో బిగ్ బాస్‌ను క్లారిటీ ఇవ్వమంటే సెలెంట్‌గా ఉన్నాడు. ఈ పవర్ గురించి ఎవరి వద్ద డిస్కస్ చేయొద్దు కాబట్టి నరేష్ ఏం మాట్లాడలేదు. అందరూ పవర్స్ తెలుసుకున్నాకా.. ఈ పవర్స్‌ను ఎప్పుడు ఉపయోగించాలనుకుంటున్నారో తనకు చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు.

గేమ్ మార్చేసే మ్యాజికల్ పవర్స్

అప్పుడు దానికి సంబంధించిన కీస్ ఇస్తామని, అప్పటివరకు వాటిని ట్రేలో పెట్టాలని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ మ్యాజికల్ పవర్స్ ద్వారా బిగ్ బాస్ గేమ్ మొత్తం మారనుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More