Bigg Boss: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ట్విస్టులు- జుట్టు కత్తిరించుకున్న భాగీ తుళ్లూరు ఎలిమినేట్- సెట్‌లోనే కన్నీళ్లు!
Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెరపై తీవ్ర ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 నుంచి అనూహ్య ఎలిమినేషన్ ట్విస్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ 10 ప్రధాన హౌస్‌లోకి వెళ్లేందుకు జుట్టు కత్తిరించుకున్న భాగీ తుళ్లూరు చివరి నిమిషంలో ఎలిమినేట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2' షో ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 10 హౌజ్‌లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు.

ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్లు, ట్విస్టులు
రోజురోజుకూ పెరుగుతున్న వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలతో ఈ తెలుగు రియాలిటీ ఓటీటీ షో మంచి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో ఈ షో షూటింగ్ పూర్తి కానుండగా, ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ట్విస్టులు బయటకు వచ్చాయి.
గాయత్రీ ఎలిమినేషన్.. ఓట్లు వేస్తే వేస్టే!
ఇప్పటికే టాప్ 15 కంటెస్టెంట్ల కోసం ఓటింగ్ లైన్లు తెరిచారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం గాయత్రీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎపిసోడ్‌లో వచ్చిన ఎల్లో కార్డుతో పాటు జడ్జిలు కూడా మరొక ఎల్లో కార్డు ఇవ్వడంతో ఆమె నిష్క్రమణ ఖాయమైంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఈ ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కాకపోవడంతో యాప్‌లో ఆమె ఓటింగ్ లైన్లు తెరిచే ఉన్నాయి. గాయత్రీకి ఓట్లు వేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న భాగీ తుళ్లూరు!
నెల్లూరు యాస, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన భాగీ తుళ్లూరు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో అడుగుపెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తన జుట్టును కూడా కత్తిరించుకుని బేబీ కట్ చేయించుకున్నారు.
ఏడ్చేసిన భాగీ తుళ్లూరు
టాస్కుల్లో నూటికి నూరు శాతం ప్రతిభ చూపించినప్పటికీ చివరి ఘట్టంలో ఎలిమినేట్ కావడంతో భాగీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "షో కోసం జుట్టు కత్తిరించుకున్నాను, టాస్కుల్లో వంద శాతం కష్టపడ్డాను, మరో రెండు రోజులు ఉంటే బిగ్ బాస్ 10 స్టేజ్ పైన ఉండేదాన్ని" అని భాగీ తుళ్లూరు సెట్‌లోనే బోరున ఏడ్చేసినట్లు సమాచారం.
రేసులో 13 మంది కంటెస్టెంట్లు
భాగీ, గాయత్రీ నిష్క్రమణతో ప్రస్తుతం రేసులో 13 మంది కంటెస్టెంట్లు మిగిలారు. మిగిలిన రెండు రోజుల చిత్రీకరణలో కేవలం 10 మంది మాత్రమే బిగ్ బాస్ 10 తెలుగుకు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చరణ్‌కు భారీ ఓటింగ్.. కానీ ప్రమాదంలోనే!
కంటెస్టెంట్ చరణ్‌కు ఓటింగ్ భారీ స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ, గేమ్ పరంగా అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే జడ్జిలు ఏ క్షణమైనా అతడిని ఎలిమినేట్ చేసే ప్రమాదం పొంచి ఉందని ప్రచారం సాగుతోంది. చివరి రెండు రోజుల్లో జరగబోయే షూటింగ్‌తో 'బిగ్ బాస్ తెలుగు 10'లోకి అడుగుపెట్టే ఆ టాప్ 10 కంటెస్టెంట్లు ఎవరో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
బిగ్ బాస్ తెలుగు 10 వివరాలు
కాగా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి జడ్జ్‌లుగా అభిజీత్, నవదీప్, బిందు మాధవి వ్యవహరిస్తుండగా.. యాంకర్‌గా శ్రీముఖి చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 10కు హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


