Bigg Boss 10: 15 లక్షలతో అగ్గి రాజేసిన బిగ్ బాస్, నాగార్జున- సిగ్గు శరం లేదు- త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ

Bigg Boss Telugu 10 Today September 27 Episode: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఊహించని పరిణామాలతో, ట్విస్టులతో సాగుతోంది. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ మధ్య జరిగిన చిన్న చిన్న మాటలు గొడవ పెడితే తాజాగా బిగ్ బాస్ పెట్టిన 15 లక్షల టెంప్టెషన్ అగ్గిరాజేసింది. దాంతో త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ వంశీగా మారింది.

Published on: Sep 27, 2026, 14:21:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 Trigun Vs Aman Vs Temper Vamsi: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ సీజన్‌లో లేని విధంగా 10లో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు నిర్వాహకులు.

15 లక్షలతో అగ్గి రాజేసిన బిగ్ బాస్, నాగార్జున- సిగ్గు శరం లేదు- త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ
15 లక్షలతో అగ్గి రాజేసిన బిగ్ బాస్, నాగార్జున- సిగ్గు శరం లేదు- త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ

బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి

బిగ్ బాస్ 10 తెలుగు ఈ వారం టెంప్టేషన్ అండ్ టెన్షన్ అనే థీమ్ సాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టెంప్టేషన్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి రూ. 15 లక్షల ఆఫర్ ఇచ్చారు. అది బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కూడా చెప్పారు. దాంతో ఆ 15 లక్షలను రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు.

అయితే, ఇదంతా జరిగే క్రమంలో మిథిలేషన్‌ను మిగతా కంటెస్టెంట్స్ వెళ్లకుండా ఉండేందుకు కన్విన్స్ చేయడంతోపాటు హౌజ్‌మేట్స్‌ ఒప్పుకునేందుకు మిథిలేష్ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించడం వంటివి జరిగాయి. ఈ ప్రాసెస్‌లో మిథిలేష్ ఆ డబ్బు తీసుకోడానికి అంగీకరిస్తున్నట్లు సృష్టి, శాలిని, రోహిత్, రామ్ ప్రసాద్, వర్షిణి, చరణ్, అపూర్వ, అమన్ చేయి ఎత్తారు.

15 లక్షలతో మిథిలేష్ ఎలిమినేషన్

అంతేకాకుండా జబర్దస్త్ రామ్ ప్రసాద్ అయితే మనకు కావాల్సింది కప్ గానీ డబ్బు కాదు అని మరి మిథిలేష్ చేతిలే 15 లక్షల సూట్‌కేస్ పెట్టి పంపించాడు. మిథిలేష్ వెళ్లిపోయాడు. దీని తర్వాత హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య అగ్గి రాజుకుంది. రామ్ ప్రసాద్‌ను నిల్చోబెట్టి త్రిగుణ్, ముఖేష్ కడిగేశారు.

"అతను తీసుకెళ్తుంది విన్నర్ డబ్బులు. అలా ఎలా పంపిస్తావ్" అని ముఖేష్ అంటే.. "వాడిని లోపల నుంచి నామినేట్ చేసి బయటకు పంపాలి గానీ డబ్బులతో ఎలా పంపిస్తావ్" అని త్రిగుణ్ కోపంగా అన్నాడు. మరోవైపు "అతనికి ఆఫర్ ఇచ్చారు. అతను పిక్ చేసుకుని వెళ్లాడు" అని తన కామనర్స్ గ్యాంగ్‌తో రోహిత్ అన్నాడు. అంటే, బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని అతను తీసుకోవడాన్ని సమర్ధించాం. తప్పులేదన్నట్లుగా రోహిత్ మాటలు ఉన్నాయి.

సిగ్గు శరం లేదు

"వచ్చిన రెండు రోజుల్లో డబ్బులు తీసుకుని వెళ్తాడంట.. దీనికి వీళ్లు చేతులు ఎత్తుతారంట.. సిగ్గు శరం లేదు" అని టెంపర్ వంశీ ముందు త్రిగుణ్ చాలా కోపంగా అన్నాడు. తర్వాత అమన్ దగ్గరికి వెళ్లిన ముఖేష్.. "డబ్బులు తీసుకునేది ప్రొడక్షన్ నుంచి కాదు. ఒక విన్నర్ నుంచి" అని అన్నాడు. "నా డబ్బులు అవి" అని త్రిగుణ్ అన్నాడు.

"నాది కాదా" అని అమన్ రిప్లై ఇచ్చాడు. "అలా అయితే గేమ్ గెలిచి ఇవ్వాలి వాడికి" అని అమన్‌పై త్రిగుణ్, ముఖేష్ పడ్డారు. "ఒక్కొక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కడిది. వాడి థింగ్‌లో ఆలోచించా. నువ్వు మూసుకుని కూర్చో. చేతకాకుంటే పడుకో" అని అమన్ అన్నాడు.

త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ

దాంతో "జాగ్రత్తగా రాని మాటలు" అంటూ త్రిగుణ్ సీరియస్ అయ్యాడు. త్రిగుణ్, అమన్ ఏంట్రా, ఏంటీ అంటూ వాదించుకున్నారు. టెంపర్ వంశీ వచ్చి ఇద్దరిని కూల్ చేసేందుకు ట్రై చేశాడు. కానీ, ఎవరు వినలేదు. త్రిగుణ్ వెళ్తున్న అమన్ అరవడం వినకపోయేసరికి సహనం కోల్పోయిన టెంపర్ వంశీ "నన్ను రెచ్చగొట్టకు" అని వార్నింగ్ ఇచ్చాడు.

ఇలా మొత్తంగా హోస్ట్ నాగార్జున ద్వారా ఇచ్చిన 15 లక్షల టెంప్టేషన్ ఆఫర్ కంటెస్టెంట్స్ మధ్య అగ్గిరాజేసింది. చివరికి త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీగా మారింది. ఇందులో రోహిత్, మిగతా కామనర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది నేటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More