Bigg Boss winner: 15 లక్షలతో రెండేరోజే మిథిలేష్ ఎలిమినేషన్- బిగ్ బాస్ విన్నర్‌కి పెద్ద దెబ్బ- బతికిపోయిన టాలీవుడ్ విలన్
Bigg Boss Telugu 10 Mithilesh Elimination With 15 Lakh: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో ఊహించని సంచలన ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెండే రోజే కామనర్ మిథిలేష్ రెడ్డి రూ. 15 లక్షలతో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో టాలీవుడ్ విలన్ బతికిపోవాల్సి వచ్చింది. పూర్తి వివరాలు చూద్దాం.
Bigg Boss Telugu 10 Mithilesh Elimination With 15 Lakh: ఇంతకుముందు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ డిఫరెంట్ థీమ్స్‌తో వచ్చినప్పటికీ పెద్దగా సరికొత్త కాన్సెప్ట్స్ ఏం ఉండకపోయేవి. కానీ, వీటన్నింటికంటే చాలా డిఫరెంట్ అండ్ ఊహించని కాన్సెప్టులతో షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది బిగ్ బాస్ తెలుగు 10.

హౌజ్‌లోకి ఇద్దరు వైల్డ్ కార్డ్స్
తాజాగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు జరగని సంచలన ఎలిమినేషన్ జరిగింది. అదే కామనర్ మిథిలేష్ రెడ్డి ఎలిమినేషన్. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ 10 తెలుగులోకి 16 మంది కంటెస్టెంట్స్ రాగా.. చైత్ర రాయ్, నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. దాంతో హౌజ్‌లో 14 మంది మిగిలారు.
ఇక ఇటీవల రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అపూర్వ, మిథిలేష్ రెడ్డి ఇద్దరు బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. దాంతో హౌజ్‌లో మళ్లీ 16 మంది కంటెస్టెంట్స్ అయ్యారు. అయితే, గత వారాలు దశావతారం, పవర్ ఆఫ్ పీపుల్ అనే థీమ్‌తో బిగ్ బాస్ 10 సాగగా.. మూడో వారం టెంప్టేషన్స్ అండ్ టెన్షన్స్ అనే కాన్సెప్ట్ సాగింది.
టెంప్టేషన్ ఆఫర్
ఇక శనివారం అంటే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 26 ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్‌మేట్స్ ఆట తీరుపై రివ్యూ ఇచ్చారు. ఎపిసోడ్ చివరలో 16 మంది కంటెస్టెంట్స్‌కు టెంప్టేషన్ అండ్ టెన్షన్ టాస్క్ అప్లై చేశాడు హోస్ట్ నాగార్జున. రూ. 5 లక్షల డబ్బుతో కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఈ వారం సొంతగా ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చాడు.
కానీ, ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మిథిలేష్, అపూర్వలకు "మీరు ఇప్పుడే వచ్చారు. ఆడియెన్స్‌లో పెద్దగా క్రేజ్ తెచ్చుకోకపోవచ్చు. కానీ, డబ్బు మాత్రం ఉపయోగపడుతుంది. అది బిగ్ బాస్ విన్నర్ మనీలో 10 శాతం మనీ. ఆలోచించుకోండి" అని నాగార్జున సలహా ఇచ్చారు. కానీ, మిథిలేష్, అపూర్వ ఒప్పుకోలేదు. నో చెప్పారు.
15 లక్షల ఆఫర్
ఆ తర్వాత ఆ సూట్ కేస్ మనీని 10 లక్షలకు పెంచారు నాగార్జున. అయినా ఎవరు ఒప్పుకోలేదు. దాంతో ఆ డబ్బును 15 లక్షలకు పెంచారు. అంటే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలలో ఏకంగా 30 శాతం డబ్బు అది. ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయిన మిథిలేష్ రెడ్డి ఒప్పుకుని ఎలిమినేషన్‌కు సిద్ధమయ్యాడు.
ఒక 5 నిమిషాల టైమ్ ఇచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాడు నాగార్జున. ఆ తర్వాత కూడా మిథిలేష్ డబ్బు తీసుకునేందుకే మొగ్గు చూపాడు. అనంతరం ఈ డబ్బు అంతా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలోనుంచి కట్ అవుతుందని, హౌజ్‌మేట్స్ అంతా కలిసి మిథిలేష్‌ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించొచ్చని నాగార్జున చెప్పాడు.
కప్పు కావాలా డబ్బు కావాలా
ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందా, నువ్వు వచ్చింది నిన్ను నువ్వు చూపించుకోడానికి అని చెప్పావుగా అని బుజ్జగింపు ప్రయత్నం చేశాడు త్రిగుణ్. మధ్యలో దూరిన జబర్దస్త్ రామ్ ప్రసాద్ మాత్రం మీకు కప్పు కావాలా డబ్బు కావాలా అని అడిగాడు. అంతా కప్ అని చెప్పారు. దాంతో ఆ సూట్‌కేస్ మిథిలేష్‌కు ఇచ్చి తీసుకో. వెళ్లిపో. ఇది నీకు బిగ్ బాస్ సూట్ కాదు అని చెప్పాడు.
కంటెస్టెంట్స్ చెప్పిన మిథిలేష్ వినలేదు. "ఇప్పుడు మిథిలేష్ నిర్ణయం తీసుకున్నాడు. మీ అంగీకారం అతనికి అవసరం లేదు. కానీ, మీరు మిథిలేష్ ఆ డబ్బు తీసుకోవద్దని ఎక్కువ మంది ఓట్ చేస్తే బిగ్ బాస్ ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చు" అని హోస్ట్ నాగార్జున చెప్పాడు. మిథిలేష్ డబ్బు తీసుకునేందుకు ముందుగా ఐదుగురు చేయి లేపారు.
కన్విన్స్ చేయు
"మిగతా 10 కంటెస్టెంట్స్ చేయి ఎత్తలేదు. కాబట్టి, వారు కన్విన్స్ అయి నువ్వు డబ్బు తీసుకునేందుకు ఒప్పుకునేలా చేయు" అని మిథిలేష్‌కి టాస్క్ ఇచ్చాడు నాగార్జున. "ఇప్పుడు ఆల్రెడీ ఈక్వెషన్స్ ఫామ్ అయిపోయాయి. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన నేను వాటిని ఎంత ట్రై చేసిన మార్చలేను. అందుకే నేను స్మార్ట్ మూవ్ తీసుకుంటున్నా" అని మిథిలేష్ చెప్పాడు.
దానికి శాలిని కన్విన్స్ అయింది. ఆ తర్వాత అమన్ కూడా అయ్యాడు. మొత్తంగా మిథిలేష్ డబ్బు తీసుకునేందుకు 8 మంది ఓట్లు వేశారు. అలా 15 లక్షల సూట్‌కేస్‌తో మిథిలేష్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. అందులోనుంచి 15 లక్షలు కట్ అయిపోయినట్లే.
బిగ్ బాస్ విన్నర్‌కి దెబ్బ
దీంతో బిగ్ బాస్ విన్నర్‌కి 15 లక్షలు లాస్ అయి పెద్ద దెబ్బ పడినట్లే. అంటే, బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పటికీ 50 లక్షలు రాకుండా కేవలం రూ. 35 లక్షలు మాత్రమే చేతికి వస్తుంది. ఇదిలా ఉంటే, ఒకవేళ మిథిలేష్ డబ్బుతో వెళ్లకుంటే ఈ వారం టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యేవాడు.
బిగ్ బాస్ ఓటింగ్‌లో అతి తక్కువ ఓటింగ్ టెంపర్ వంశీకే నమోదు అయిందని, మూడో వారం అతనే ఎలిమినేట్ అవనున్నాడని ఇన్‌సైడ్ నుంచి గట్టి టాక్ వచ్చింది. రూ. 15 లక్షలతో మిథిలేష్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతో ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు. దాంతో టెంపర్ వంశీ బతికిపోయాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


