Rebel Kid: నేను ఇకపై ఇండియాలో నివసించను, ఏ మాటకు ఎలా వివాదం చేస్తారో అని భయంగా ఉంది.. రెబెల్ కిడ్ అపూర్వ కామెంట్స్
Rebel Kid Apoorva Mukhija Leaves India Reason: రెబెల్ కిడ్‌గా పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ అపూర్వ ముఖిజా ఇండియా వదిలి వెళ్లిపోతున్నట్లు తాజాగా చెప్పి షాక్ ఇచ్చింది. ఇండియాస్ గాట్ లేటెంట్ ఓటీటీ షో వివాదం తర్వాత తనపై వచ్చిన ట్రోలింగ్, కామెంట్స్‌తో మానసిక క్షోభ అనుభవించానని చెప్పుకొచ్చింది.
Rebel Kid Apoorva Mukhija Leaves India Reason: సోషల్ మీడియాలో 'రెబెల్ కిడ్'గా బాగా గుర్తింపు పొందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అపూర్వ ముఖిజా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను భారతదేశంలో నివసించడం లేదని, ఉన్నత చదువుల కోసం అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మకాం మార్చేశానని వెల్లడించింది.

ఓటీటీ షో వివాదం తర్వాత
'అన్‌ట్రిగ్గర్డ్ బ్రాండ్ అమిన్‌జజ్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అపూర్వ, ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' వివాదం తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో, దేశం వదిలి వెళ్లడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇంటర్నెట్‌లో తనపై జరుగుతున్న వరుస దాడులపై అపూర్వ విచారం వ్యక్తం చేసింది.
'క్యాన్సల్ కల్చర్' నన్ను అలసిపోయేలా చేసింది!
"చిన్న చిన్న విషయాలకే ట్రోల్ చేయడం, సోషల్ మీడియా నుంచి నన్ను పూర్తిగా నిషేధించాలంటూ (Cancel) ప్రచారం చేయడం నన్ను తీవ్రంగా అలసిపోయేలా చేసింది. ప్రతి వ్లాగ్‌లో జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నించినా, ఏ క్షణంలో ఏ మాట పట్టుకుని వివాదం చేస్తారో అర్థం కావడం లేదు" అని అపూర్వ తన ఆవేదనను పంచుకుంది.
కొన్ని వారాల పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగితే బ్రాండ్ డీల్స్ పోయి, ఆదాయం పూర్తిగా ఆగిపోతుందని అపూర్వ చెప్పింది. తాను డబ్బు సంపాదించడాన్ని ఎంతో ప్రేమిస్తానని, కానీ ఈ నిరంతర మానసిక క్షోభ వల్ల రోజువారీ సంపాదన కూడా దెబ్బతింటోందని పేర్కొంది.
డ్రీమ్ సిటీ న్యూయార్క్‌లో ఎంబీఏ (MBA)
విదేశాలకు పారిపోతున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను చిన్నప్పటి నుంచి ఇష్టపడిన న్యూయార్క్ నగరానికే వెళ్తున్నానని స్పష్టం చేసింది అపూర్వ ముఖిజా. తాను చూసిన ప్రతి ఓటీటీ వెబ్ సిరీస్‌లో న్యూయార్క్ నగరం ఎంతో వేగంగా, అందంగా అనిపించేదని, అక్కడ చదువుకోవడం తన కల అని చెప్పింది.
అక్కడ ఉన్న ఒకే ఒక్క కాలేజీకి దరఖాస్తు చేయగా, సీటు లభించిందని అపూర్వ ముఖిజా తెలిపింది. ఎంబీఏ (MBA) చదువుతూ మళ్లీ సాధారణ విద్యార్థిలా డార్మ్‌లో (హాస్టల్) ఉండబోతున్నట్లు ప్రకటించింది. అయితే, తన స్నేహితులు, కెరీర్, మూలాలు అన్నీ భారతదేశంలోనే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం కొంత భయంగానే ఉందని అపూర్వ పేర్కొంది.
ఇకపై రోజూ సోషల్ మీడియాలో కథలు చెప్పడం (Storytime videos) తగ్గించేస్తానని, నచ్చినప్పుడు మాత్రమే కంటెంట్ చేస్తానని స్పష్టం చేసింది. తనలోని వివాదాస్పద పాత అపూర్వ ("Kaleshi Aurat") ఇక లేదని వ్యాఖ్యానించింది.
ప్రాణ బెదిరింపులు తెచ్చిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' వివాదం
సమయ్ రైనా వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' ఓటీటీ షోలో రణ్‌వీర్ అలహాబాదియా తల్లిదండ్రుల శృంగారంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయం నుంచి అపూర్వ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఆ ఓటీటీ షో ప్యానెల్‌లో ఉన్న అపూర్వ, ఒక పోటీదారుడితో ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
దీనిపై పోలీసు కేసులు నమోదవడమే కాకుండా, తనకు అత్యాచార బెదిరింపులు, ప్రాణ బెదిరింపులు వచ్చాయని అపూర్వ గతంలోనే వెల్లడించింది. ఇటీవల ముగిసిన 'లాక్ అప్' రియాలిటీ షోలో కూడా ఆమె రెండు వారాల పాటు ఇన్‌ఫార్మర్‌గా పాల్గొంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


