Bigg Boss 10 Voting: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు- టాప్ 2 నుంచి టాప్ 1కి ఎగబాకిన హీరో- ఆ ఇద్దరికి డబుల్ ఎలిమినేషన్ గండం!
Bigg Boss Telugu 10 Voting This Week: బిగ్ బాస్ ఓటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టాప్ 2 నుంచి టాప్ 1లోకి హీరో ఒక్కసారిగా ఎగబాకాడు. ఇప్పటివరకు టాప్ 1లో ఉన్న కంటెస్టెంట్ కిందకు పడిపోవడం, ఈ వారం ఇద్దరికి డబుల్ ఎలిమినేషన్ గండం ఉండటం మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
Bigg Boss 10 Telugu Voting Second Week: బిగ్ బాస్ షో రోజు రోజు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య ఇగోలు, పోటీలు, గొడవలు, పగలు జోరుగానే సాగుతున్నాయి. అప్పటివరకు పోట్లాడిన కంటెస్టెంట్స్ గ్రూపులుగా మారడం వంటి ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

బిగ్ బాస్ ఓటింగ్‌లో ట్విస్టులు
కంటెస్టెంట్ల ఆట తీరు మాత్రమే కాకుండా ఆడియెన్స్ వేసే బిగ్ బాస్ ఓటింగ్‌లో కూడా ట్విస్టులు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఈవారం బిగ్ బాస్ ఓటింగ్ తారుమారైంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 10 ఈ వారం నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్, ముఖేష్ గౌడ, దేబ్జానీ మోదక్, వర్షిణి, సుధీర్, శాలిని పటేల్, సృష్టి, కృష్ణుడు, ఝాన్సీ 11 మంది నామినేట్ అయ్యారు. రెండో వారం నామినేషన్స్ పూర్తయిన వెంటనే వీరికి ఓటింగ్ పోల్ పెట్టారు బిగ్ బాస్ మేకర్స్.
టాప్ 1లోకి దూసుకెళ్లిన త్రిగుణ్
అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో టాప్ 1 ప్లేసులో కామనర్ అయిన రోహిత్ నాయుడు అత్యధిక ఓట్లతో నిలుస్తూ వచ్చాడు. కానీ, తాజాగా రోహిత్‌ను దాటుకుని టాప్ 2 నుంచి టాప్ 1 స్థానంలోకి ఎగబాకాడు సినీ హీరో త్రిగుణ్. 32.07 శాతం ఓటింగ్ (31,967 ఓట్లు)తో టాప్ 1 ప్లేసుతో దూసుకుపోతున్నాడు హీరో త్రిగుణ్.
త్రిగుణ్ తర్వాత 30.55 శాతం (30,451 ఓట్లు) ఓటింగ్‌తో రోహిత్ రెండో స్థానంలోకి పడిపోయాడు. త్రిగుణ్, రోహిత్ మధ్య కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే తేడా ఉంది. ఇక మూడో స్థానంలో సీరియల్ హీరో ముఖేష్ గౌడ 10.03 శాతం ఓటింగ్- 9,999 ఓట్లతో నిలిచాడు. ఈ ముగ్గురి మధ్య టాప్ ప్లేస్‌కి గట్టి పోటీ నడుస్తోంది.
ఎవరికి ఎంత ఓటింగ్
7.59 శాతం ఓటింగ్ (7,564 ఓట్లు)తో జబర్దస్త్ రామ్ ప్రసాద్ 4వ స్థానంలో, 5.35 శాతం ఓటింగ్-5,330 ఓట్లతో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ ఐదో ప్లేసులో, 3.84 శాతం ఓటింగ్-3,831 ఓట్లతో శాలిని ఆరో స్థానంలో, 2.4 శాతం ఓటింగ్-2,390 ఓట్లతో ఝాన్సీ 7వ ప్లేసులో ఉన్నారు.
అలాగే, సృష్టి వ్యాకరణం 2.24 శాతం ఓటింగ్-2,235 ఓట్లతో 8వ స్థానంలో ఉంటే యాంకర్ సుధీర్ రెడ్డి 2.06 శాతం ఓటింగ్-2,055 ఓట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక చివరి రెండు 10, 11 స్థానాల్లో నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి ఉన్నారు. 1.96 శాతం ఓటింగ్-1,953 ఓట్లు కృష్ణుడుకి వస్తే.. 1.9 శాతం ఓటింగ్-1,896 ఓట్లు వర్షిణి తెచ్చుకుంది.
చివరి రెండు స్థానాల వారికి ఎలిమినేషన్ గండం
ఇదిలా ఉంటే, ఈ వారం అంటే బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. మొదటి వారం ఇద్దరి కంటెస్టెంట్స్‌ను మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేసి ఒకరిని తిరిగి హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అలాగే, రెగ్యులర్ వీకెండ్‌కి నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు.
కాబట్టి, ఈ కారణాలతో ఈ వారం బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన బిగ్ బాస్ ఓటింగ్‌లో చివరి రెండు 10, 11 స్థానాల్లో ఉన్న కృష్ణుడు, వర్షిణికి ఎలిమినేషన్ గండం పొంచి ఉందని తెలుస్తోంది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఇంటి నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


