Bigg Boss Elimination: ఇవాళ బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్- హౌజ్‌మేట్స్‌గా మారిన ఆరుగురు- హై రిస్క్‌లో 8 మంది కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 10 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో ఇవాళ నో ఎలిమినేషన్ అంటూ ఊహించని ట్విస్ట్ ఎదురుకానుంది. అయితే, 16 మంది కంటెస్టెంట్స్‌లో ఇద్దరు ఇదివరుకే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వాళ్లలో ఆరుగురు హౌజ్‌మేట్స్‌గా కన్ఫర్మ్ అయ్యారు. వారెవరో చూద్దాం.

Published on: Sep 13, 2026, 10:41:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 September 12 Episode Highlights: తెలుగు టీవీ, ఓటీటీ షో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. దశావతారం అనే కాన్సెప్టుతో వచ్చిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ అలాగే వివిధ అవతారాలు చూపిస్తోంది.

ఇవాళ బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్- హౌజ్‌మేట్స్‌గా మారిన ఆరుగురు- హై రిస్క్‌లో 8 మంది కంటెస్టెంట్స్
ఇవాళ బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్- హౌజ్‌మేట్స్‌గా మారిన ఆరుగురు- హై రిస్క్‌లో 8 మంది కంటెస్టెంట్స్

ఇద్దరు ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మొదటి వారం పూర్తి కాకముందే నాలుగైదు రోజుల్లో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసి పంపించి ఈ సీజన్ పూర్తిగా డిఫరెంట్ అని నిరూపించారు. ఇదిలా ఉంటే ప్రతి వీకెండ్‌కి హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇస్తారన్నది తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 12వ తేది అంటే శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల దుమ్ముధులిపారు. త్రిగుణ్, రోహిత్, శాలిని, రామ్ ప్రసాద్‌కి వార్నింగ్‌లు ఇచ్చాడు. అలాగే, మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయిన చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్‌లను వీడియో కాల్‌లో కంటెస్టెంట్స్‌తో మాట్లాడించారు.

వైల్డ్ కార్డ్‌తో రీ ఎంట్రీ అంటూ

చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ తర్వాత సీక్రెట్ రూమ్‌లో ఉండి ఉంటారని, వైల్డ్ కార్డ్‌తో రీ ఎంట్రీ ఇస్తారని చాలా ఊహగానాలు జరిగాయి. ఆ ఆలోచనలు కంటెస్టెంట్స్ లోపల కూడా ఉన్నాయని నాగ్ భావించి వాటిపై క్లారిటీ ఇచ్చేశాడు. ఇక చరణ్, చైత్ర కంప్లీట్‌గా ఎలిమినేట్ అయినట్లే అని తెలిసిపోయింది.

ఈ సీజన్‌లోకి కంటెస్టెంట్స్ తామేంటో నిరూపించుకున్నాకే హౌజ్‌మేట్స్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అందుకు పెట్టిన టాస్కులు, పరీక్షల్లో గెలిచి ఇదివరకే రోహిత్ నాయుడు, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్ ముగ్గురు హౌజ్‌మేట్స్‌గా నిలిచారు. తాజా ఎపిసోడ్‌లో ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా మిగతా కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్ అవుతారని నాగ్ చెప్పారు.

4వ హౌజ్‌మేట్‌గా త్రిగుణ్

అలా మొదటగా హీరో త్రిగుణ్ నాలుగో హౌజ్‌మేట్ అయ్యాడు. బోర్డ్‌పై సాండ్‌తో త్రిగుణ్ పేరు చూపించి హౌజ్‌మేట్ అయినట్లు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత కామనర్ శాలిని ఆడియెన్స్ నుంచి అధిక ఓటింగ్ సాధించి ఐదో హౌజ్‌మేట్‌గా నిలిచింది. తనకు ఓట్ వేసినందుకు ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెప్పి నెక్ట్స్ నుంచి ఏడవనని, ఆటతో ఇచ్చి పడేస్తానని జోష్‌గా చెప్పింది.

ఇక బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ చివరలో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ ఆరో హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అలా ప్రస్తుతం ఆరుగురు సేవ్ అయి బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌గా నిలిచారు. మిగతా వారంత హై రిస్క్‌లో ఉన్నారని నాగార్జున చెప్పేసి వెళ్లిపోయాడు.

8 మంది హై రిస్క్‌లో

అంటే, మొత్తంగా 8 మంది కంటెస్టెంట్స్ హై రిస్క్‌లో ఉన్నారు. వారిలో వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, కామనర్ అమన్ మసూద్, సింగర్ ఝాన్సీ ఉన్నారు. అంటే వీరు వచ్చే వారంలో సరిగా ఆడకపోతే ఎలిమినేట్ అయ్యేందుకు అధిక అవకాశాలు ఉంటాయి.

ఇదిలా ఉంటే ఇవాళ అంటే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 13 ఎపిసోడ్‌లో రెగ్యులర్ విధానం ప్రకారం ఒకరు ఎలిమినేట్ అవనున్నారని ప్రచారం సాగింది. చరణ్, చైత్రతోపాటు మరొకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. తక్కువ ఓటింగ్ నమోదైన నటుడు కృష్ణుడే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కానున్నారని తెగ టాక్ నడిచింది.

ఇవాళ నో ఎలిమినేషన్

కానీ, ఊహించనివిధంగా ట్విస్ట్ ఇస్తూ ఇవాళ నో ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున ప్రకటించినట్లు సమాచారం. ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం ఇవాళ ఎలిమినేషన్ లేదు. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం వల్ల ఇవాళ నో ఎలిమినేషన్ పెట్టారని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More