Bigg Boss 10 Telugu: ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ భయ్యో..బిగ్ బాస్ హౌస్ నుంచి 15 లక్షలతో బయటకొచ్చిన మిథిలేష్..ప్రైజ్ మనీ కట్!

Bigg Boss 10 Telugu: ఇప్పటికే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు  10వ సీజన్ లో మరో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇది. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి రెండు రోజుల క్రితమే ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ ఇప్పుడు బయటకు వచ్చేశాడని టాక్. ఏకంగా రూ.15 లక్షల మనీతో అతను హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని సమాచారం. 

Published on: Sep 26, 2026, 17:00:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పదో సీజన్ ను ఫస్ట్ వీక్ నుంచే ఇంట్రెస్టింగ్ గా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. వైల్డ్ కార్డుగా అడుగుపెట్టిన మిథిలేష్ బయటకు వచ్చాడని టాక్.

ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ భయ్యో.. బిగ్ బాస్ హౌస్ నుంచి 15 లక్షలతో బయటకొచ్చిన మిథిలేష్! (youtube/starmaa)
ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ భయ్యో.. బిగ్ బాస్ హౌస్ నుంచి 15 లక్షలతో బయటకొచ్చిన మిథిలేష్! (youtube/starmaa)

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలకు అపూర్వ, మిథిలేష్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఓట్లు వేస్తే లీస్ట్ ఓట్లు వేసిన అపూర్వను హౌస్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత నవరసాలు ఆర్కే, మిథిలేష్ కు టాస్క్ పెట్టారు. అందులో గెలిచిన మిథిలేష్ హౌస్ లోకి వెళ్లాడు.

వీకెండ్ ట్విస్ట్

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మిథిలేష్ కంటెస్టెంట్ అయిపోయాడు. హౌస్ లో ఉంటున్నాడు. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ మిథిలేష్ కు బంపరాఫర్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇది పెద్ద ట్విస్ట్ అని సమాచారం. డబ్బు ఆశతో మిథిలేష్ హౌస్ ను వదిలేశాడని తెలిసింది. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారని టాక్.

రూ.15 లక్షలు

బిగ్ బాస్ 10 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కోసం సిగ్మా మూవీ హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ జేసన్ సంజయ్ వచ్చారని సమాచారం. వీళ్లు వచ్చి మిథిలేష్ కు ఆఫర్ ఇచ్చారంటా. సూట్ కేస్ తో వచ్చి మనీ తీసుకొని బయటకు వెళ్లమన్నారంటా. ఫస్ట్ రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు, చివరగా రూ.15 లక్షలు ఆఫర్ చేశారని టాక్.

ప్రైజ్ మనీ నుంచి కట్

ఆ రూ.15 లక్షలు తీసుకొని బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి వెళ్లిపోయేందుకు మిథిలేష్ ఓకే చెప్పాడని తెలిసింది. అయితే ఆ డబ్బును ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని బిగ్ బాస్ చెప్పడంతో మిగతా కంటెస్టెంట్లు ఒప్పుకోలేదని టాక్. అయితే మిగతా కంటెస్టెంట్లను ఒప్పించి ఆ సూట్ కేసుతో మిథిలేష్ బయటకు వచ్చాడని అంటున్నారు.

మరి మిథిలేష్ నిజంగానే ఆ డబ్బును తీసుకొని వెళ్లిపోయాడా? లేదా స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత మళ్లీ ఏమైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా? నాగార్జున ఏమైనా చేశారా? అన్నది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More