Bigg Boss 10 Telugu: ఇది పెద్ద ట్విస్టే.. బిగ్ బాస్ 10 తెలుగులోకి ఏకంగా మూడు వైల్డ్ కార్డు ఎంట్రీలు.. ఎవరో తెలుసా?
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మరింత ఊపు తెచ్చేందుకు మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ముగ్గురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా తీసుకొస్తున్నట్లు సమాచారం. అగ్నిపరీక్షలో పాల్గొన్నవాళ్లలోనే ఈ ముగ్గురు ఉన్నట్లు టాక్.
Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ బిగ్ బాస్ 10వ తెలుగులో ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. ఫస్ట్ వీక్ నుంచే ఈ సారి సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడేమో వైల్డ్ కార్డు ఎంట్రీలతో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

బిగ్ బాస్ 10 తెలుగులో వైల్డ్ కార్డు
బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆట బోర్ కొడుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు అనుకునే టైమ్ లో వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్లు వస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగులోనూ వైల్డ్ కార్డులు రాబోతున్నారు. ఈ సారి రెండు సార్లు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.
ఆ ముగ్గురు
ముందుగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టబోతున్నారని తెలిసింది. ఈ ముగ్గురు కూడా ఈ సీజన్ కు ముందు అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేసినవాళ్లే అని సమాచారం. వాళ్లే.. నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ అని టాక్.
ఎంట్రీ ఎప్పుడంటే?
బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ మోస్ట్ లీ ఈ రోజు లేదా రేపు ఉండచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ వెళ్లారని తెలిసింది. ఫస్ట్ అయితే ఈ ముగ్గురు హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయం.
అదే ట్విస్ట్
రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత వీళ్లకు టాస్క్ లు, ఓటింగ్ పెడతారని తెలిసింది. మరి ఈ ముగ్గురిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి తీసుకుంటారా? లేదా వీళ్లలో ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి వైల్డ్ కార్డు ఎంట్రీలపై మాత్రం ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు.
ఇక హౌస్ లోకి అపూర్వ అడుగుపెడితే ఆట మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే అగ్నిపరీక్షలో రోహిత్, అపూర్వ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక హౌస్ లోనేమో రోహిత్, శాలిని మధ్య బాండింగ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అపూర్వ వచ్చి రోహిత్ తో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


