Bigg Boss 10 Nominations: గుద్దితే పళ్లు రాలిపోతాయ్-సృష్టి ఉగ్రరూపం-సుధీర్ బలి- ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో వీళ్లే!
Bigg Boss 10 Nominations: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మళ్లీ వేడెక్కింది. ఫస్ట్ వీక్ నుంచే హౌస్ లో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మూడో వీక్ నామినేషన్లలో భాగంగా సృష్టి రచ్చ రచ్చ చేసింది. సుధీర్ పై మాటలతో రెచ్చిపోయింది. అలాగే ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరున్నారో కూడా ఇక్కడ చూసేయండి.
Bigg Boss 10 Nominations: అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావా? ఏమైనా ఆడుతున్నావా? అని నాగార్జున ఫైర్ అయ్యేసరికి సృష్టి యాంగర్ మోడ్ లోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మూడో వారం నామినేషన్లలో సుధీర్ పై ఆమె మాటలతో రెచ్చిపోయింది.

సృష్టి వర్సెస్ సుధీర్
బిగ్ బాస్ 10 తెలుగు మూడో వీక్ నామినేషన్ రణరంగంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సృష్టి వర్సెస్ సుధీర్ గొడవ వేరే లెవల్ లో ఉందని అంటున్నారు. సుధీర్ పై సృష్టి మాటలతో రెచ్చిపోయింది. నోటికి ఎంతొస్తే అంత వాగేసింది. లేటెస్ట్ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమోలో ఇదంతా కనిపించింది.
మంట రాజేసిన రోహిత్
మూడో వారం నామినేషన్లలో సృష్టి వర్సెస్ సుధీర్ గొడవకు రోహిత్ మంట రాజేసినట్లు కనిపిస్తోంది. రోహిత్ నామినేషన్లలో సుధీర్, సృష్టి పేరు తీసుకొచ్చాడు. సుధీర్ అంటే సృష్టి అని సుధీర్ చెప్పాడని రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో హౌస్ లో కలకలం రేగింది.
రెచ్చిపోయిన సృష్టి
రోహిత్ మాటలకు సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. కానీ రోహిత్ ప్లాన్డ్ గా సుధీర్ ను ఇరికించినట్లు తెలుస్తోంది. తనతో సుధీర్ క్లోజ్ గా ఉంటున్నట్లు చెప్పుకోవడం సృష్టికి నచ్చలేదు. దీంతో సుధీర్ పై రెచ్చిపోయింది.
సుధీర్ ఏమో బిగ్ బాస్ హౌస్ లో సృష్టి, నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. సృష్టి ఏమో ఫ్రెండ్స్ కూడా కాదన్నది. దీంతో ‘బిగ్ బాస్ నాకు ఫ్రీడమ్ దొరికింది’ అని సుధీర్ గట్టిగట్టిగా అరిచాడు.
పళ్లు రాలిపోతాయ్
సుధీర్ గట్టిగా అరవడంతో సృష్టి ఇంకా ట్రిగర్ అయింది. ఆమెలోని కోపమంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. ‘గుద్దితే పళ్లు రాలిపోతాయ్’ అంటూ సుధీర్ పైకి వేలు చూపిస్తూ సృష్టి దూసుకెళ్లింది. ఇంకా చాలా మాటలే అన్నది. సృష్టిని ఆపేందుకు హౌస్ మేట్స్ ట్రై చేసినా, ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది.
నామినేషన్స్ లో వీళ్లు
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మూడో వారంలో 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నట్లు తెలిసింది. టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ థీమ్ తో సాగుతున్న ఈ వీక్ లో.. సుధీర్, వంశీ, వర్షిణి, సృష్టి, రోహిత్, శాలిని, త్రిగుణ్, ముఖేష్ నామినేట్ అయినట్లు సమాచారం. ఈ నామినేషన్ ప్రక్రియలో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్, సుధీర్ వర్సెస్ త్రిగుణ్ గొడవలు కూడా జరిగినట్లు టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


