Sai Pallavi: సీతగా సాయి పల్లవి కత్తిపట్టి యుద్ధం చేయడం నాకు కనెక్ట్ కాలేదు, కానీ:రామాయణంలో కౌసల్య పాత్ర ఇందిరా కామెంట్స్
Ramayana Actress Indira Krishnan On Sai Pallavi Sword Fight: రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీలో సాయి పల్లవి సీతాదేవిగా కత్తి పట్టి యుద్ధం చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ఈ సినిమాలో కౌసల్య పాత్ర పోషించిన సీనియర్ నటి ఇందిరా కృష్ణన్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Ramayana Kausalya Actress Indira Krishnan On Sai Pallavi Sword Fight: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణం’ చిత్రంపై దేశవ్యాప్తంగా అపారమైన అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఖర, దూషణుల రాక్షస మూకలతో పోరాటం
అయితే ఈ సినిమాలో సీతాదేవి పాత్ర రూపకల్పనపై ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అడవిలో ఖర, దూషణుల రాక్షస మూకలతో జరిగే పోరాటంలో సీతాదేవిగా సాయి పల్లవి చేతిలో కత్తి పట్టి యుద్ధం చేసే సన్నివేశాలు నెట్టింట లీక్ కావడమే ఈ వివాదానికి కారణమైంది.
"నాకూ మొదట కనెక్ట్ కాలేదు": కౌసల్య పాత్రధారి ఇందిరా కృష్ణన్
ఈ విమర్శలపై చిత్రంలో శ్రీరాముడి తల్లి కౌసల్య పాత్రలో నటించిన సీనియర్ నటి ఇందిరా కృష్ణన్ ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రేక్షకుల సందేహాలను తాను కూడా అర్థం చేసుకోగలనని ఆమె వ్యాఖ్యానించారు.
"చిన్నప్పటి నుంచి బుల్లితెరపై చూసిన రామాయణంలో సీతాదేవిని యోధురాలిగా ఎప్పుడూ చూడలేదు. అందుకే మొదట్లో సాయి పల్లవి కత్తి పట్టిన దృశ్యాలను చూసినప్పుడు నాకు కూడా అంతగా కనెక్ట్ కాలేదు" అని ఇందిరా కృష్ణన్ స్పష్టం చేశారు.
సీతను ‘వీరనారి’గా చూపించడం వెనుక అసలు కారణం
దర్శకనిర్మాతలు సీతాదేవిని కేవలం శాంతమూర్తిగానే కాకుండా ఒక వీరనారిగా ఎందుకు చూపించాలనుకున్నారో కూడా ఇందిరా వివరించారు. "సీతాదేవి బలహీనురాలు కాదని లోకానికి చాటిచెప్పడమే దర్శకనిర్మాతల ముఖ్య ఉద్దేశం. క్షత్రియ రాజవంశం నుంచి వచ్చిన సీతకు చిన్నప్పటి నుంచే ఖడ్గ విద్యలో శిక్షణ ఇచ్చారు. ఆమెలోని సున్నితత్వంతో పాటు శౌర్యాన్ని కూడా ప్రదర్శించాలనే ఈ యుద్ధ ఘట్టాన్ని తీర్చిదిద్దారు" అని ఇందిరా కృష్ణన్ పేర్కొన్నారు.
రామాయణ చిత్రంలో కేవలం సీత మాత్రమే కాకుండా ఇతర స్త్రీ పాత్రలను కూడా ఎంతో బలంగా తీర్చిదిద్దినట్లు ఆమె వివరించారు. కౌసల్య అనగానే ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకునే తల్లిగా కాకుండా, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా తాను నటించానని చెప్పారు. రావణాసురుడి తల్లి కైకసి కూడా యుద్ధ నైపుణ్యం కలిగిన వీరవనిత అని, ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని వెల్లడించారు.
సీతమ్మ తల్లి నా ద్వారా నటించింది: సాయి పల్లవి
గతంలో న్యూఢిల్లీలో జరిగిన 'ప్రథమ సంకల్ప' కార్యక్రమంలో సాయి పల్లవి సీతాదేవి పాత్ర గురించి భావోద్వేగంగా మాట్లాడారు. దేవుళ్ల పాత్రలు పోషించడం నటులకు అంత సులభం కాదని, ఇది తానంతట తాను ఎంచుకున్న పాత్ర కాదని వ్యాఖ్యానించారు.
"సీతాదేవి పాత్ర చేయడం నేను చేసుకున్న అదృష్టం. షాట్ ఇచ్చే ముందు ధ్యానం చేసుకుని సీతమ్మ తల్లే నా ద్వారా అభినయించేలా చూడమని వేడుకునేదాన్ని. తెరపై కనిపించే ఆ రూపం అమ్మవారి అనుగ్రహమే" అని సాయి పల్లవి చెప్పిన విషయం తెలిసిందే.
రామాయణ నటీనటులు
రెండు భాగాలుగా వస్తున్న ఈ మహాకావ్య చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ యశ్ రావణాసురుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన రామాయణ మొదటి భాగం 2026 నవంబర్ 5న విడుదల కాగా.. రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


