Sai Pallavi: బాబోయ్.. సాయి పల్లవి మాస్ ఛేంజోవర్.. సీతాదేవి నుంచి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా.. ఫైట్స్ కూడా.. ఒకే నెలలో!

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’లో సీతాదేవిగా నటిస్తున్న ఆమె.. దానికి పూర్తి భిన్నంగా ధనుష్ పాన్ ఇండియా మూవీ ‘ఓం – చాప్టర్ 1’లో ఖాకీ డ్రెస్ వేసింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరలైంది. 

Published on: Oct 27, 2026, 09:31:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi: తనదైన సహజ నటన, అద్భుతమైన డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు మునుపెన్నడూ చూడని సరికొత్త ఛేంజోవర్‌తో షాక్ ఇస్తోంది. నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాలో ఆమె సీతాదేవిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓం మూవీలో పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా అవతారమెత్తింది.

బాబోయ్.. సాయి పల్లవి మాస్ ఛేంజోవర్.. సీతాదేవి నుంచి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా.. ఫైట్స్ కూడా.. ఒకే నెలలో!
బాబోయ్.. సాయి పల్లవి మాస్ ఛేంజోవర్.. సీతాదేవి నుంచి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా.. ఫైట్స్ కూడా.. ఒకే నెలలో!

సీతాదేవి వర్సెస్ నిత్యారెడ్డి

రామాయణం సినిమాలో సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ పవిత్రమైన క్యారెక్టర్ ను అంతే భక్తిభావంతో ప్లే చేస్తోంది. ఈ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆమె ఎంతో రీసెర్చ్ చేసి, హోమ్ వర్క్ కూడా చేసింది. అయితే రామాయణం తర్వాత ఆమె ఎలాంటి రోల్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు, పూర్తిగా ఊహించని విధంగా కమర్షియల్ యాక్షన్ డ్రామాలో రఫ్ అండ్ టఫ్ పోలీస్‌గా దర్శనమిచ్చి థ్రిల్ చేసింది.

సాయి పల్లవి పవర్‌ఫుల్ ఎంట్రీ

టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్, రీసెంట్‌గా ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తోంది. అదే ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’. ఈ పాన్ ఇండియా చిత్రంలో సాయి పల్లవి ‘నిత్యారెడ్డి’ అనే డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది.

గ్లింప్స్ వైరల్

తాజాగా ఓం మూవీ నుంచి రిలీజ్ చేసిన సాయి పల్లవి గ్లింప్స్ వీడియో వైరల్ గా మారింది. సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన అనుభవంతో పాటు.. అత్యంత నిజాయితీ గల ఆఫీసర్‌గా ఆమె క్యారెక్టర్ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే ‘ఆపరేషన్ ఓం’ను ఆమె లీడ్ చేయనుంది. తాజాగా విడుదలైన ఆమె క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్‌కు అద్భుతమైన వ్యూస్, రెస్పాన్స్ వస్తున్నాయి.

తొలిసారిగా యాక్షన్ ఫైట్స్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన కెరీర్‌లో డాన్స్‌లు, ఎమోషనల్ యాక్టింగ్‌తోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఈ ఓం సినిమాలో తన కంఫర్ట్ జోన్‌ను దాటి మొదటిసారిగా యాక్షన్ ఫైట్స్ చేస్తూ కనిపించడం విశేషం. టీజర్‌లో ఆమె గన్ పట్టుకుని ఆపరేషన్‌లో పాల్గొన్న తీరు, సీరియస్ లుక్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ధనుష్‌తో ఆమెకు ఉన్న కాంబినేషన్ సీన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

నవంబర్ నెలలోనే

సాయి పల్లవి రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేసిన రామాయణం, ఓం సినిమాలు నవంబర్ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. రామాయణం నవంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇక ‘ఓం’ మూవీ నవంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి స్మగ్లర్‌గా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేస్తుండగా.. శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఓం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు భక్తిభావం ఉట్టిపడే సీతగా, మరోవైపు తుపాకీ పట్టిన పవర్‌ఫుల్ పోలీస్‌గా బిగ్ స్క్రీన్ పై సాయి పల్లవిలోని వైవిధ్యమైన నటన చూసి సినీ లవర్స్ ఫిదా అవడం ఖాయం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More