Sai Pallavi: నా బ్రెయిన్ వాడలేదు.. సీతమ్మ ఆశీస్సులతోనే సినిమా చేశా.. ఆ పాత్రలో లీనమైపోయా: సాయి పల్లవి
Sai Pallavi: బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ రామాయణంలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి.. తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆమె మాట్లాడుతూ.. సీతమ్మ ఆశీస్సులతోనే ఆ పాత్రలో నటించానని, తన సొంత తెలివిని వాడలేదని చేసిన ఎమోషనల్ కామెంట్స్ విని అమితాబ్ బచ్చన్ సైతం ఆశ్చర్యపోయారు.
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి పాత్రకైనా తనదైన సహజ నటనతో ప్రాణం పోసే ఈ అద్భుత నటి, ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్నారు.

సాయి పల్లవి కామెంట్స్
రామాయణం లాంటి మోస్ట్ ప్రిస్టేజియస్ మూవీ, అందులోనూ సీతమ్మ పాత్ర చేయడంపై సాయి పల్లవి తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తన పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నా బ్రెయిన్ వాడలేదు
సాధారణంగా సాయి పల్లవి ఏ సినిమా చేసినా, అందులో తన మార్క్ ఉండేలా చూసుకుంటుంది. కానీ సీతాదేవి పాత్రకు మాత్రం తాను పూర్తిగా భిన్నంగా వ్యవహరించినట్లు ఆమె తెలిపారు. "నేను ఏ పాత్ర చేసినా, దానికి నా వంతుగా కొంత ఇన్ పుట్స్ ఇస్తా, నాదైన స్టైల్ యాడ్ చేస్తా. కానీ రామాయణంలో సీతాదేవి లాంటి పవిత్రమైన పాత్రను పోషిస్తున్నప్పుడు మాత్రం నేను నా బ్రెయిన్ వాడలేదు’’ అని సాయి పల్లవి చెప్పారు.
‘‘సొంత తెలివిని అస్సలు ఉపయోగించలేదు. అలాంటి గొప్ప క్యారెక్టర్ నుంచి నేను ఏమి నేర్చుకోగలను, ఏమి గ్రహించగలను అని మాత్రమే ఆలోచించాను. ఆ తల్లి ఆశీస్సులు తీసుకుని, అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సీత పాత్రలో నేను పూర్తిగా లీనమైపోయా’’ అని సాయి పల్లవి ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్ సైతం ఫిదా
ఇటీవల ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కెబిసి) కి విచ్చేసిన సాయి పల్లవి ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన మాటలు విన్న హోస్ట్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో ఇంప్రెస్ అయ్యారు. ఒక పవిత్రమైన పాత్ర పట్ల సాయి పల్లవికి ఉన్న అపారమైన గౌరవం, అంకితభావం చూసి ఆయన ముగ్ధులయ్యారు. నటనతోనే కాకుండా, తన మాటలతోనూ సాయి పల్లవి అందరి హృదయాలను గెలుచుకుందని అక్కడి వారు సైతం ప్రశంసించారు.
అంచనాలు పెంచేలా
నిజానికి సీతాదేవి అనగానే ప్రశాంతత, సహనం, ఎదిరించే ధైర్యం గుర్తుకొస్తాయి. సాయి పల్లవి రూపం, ఆమె వ్యక్తిత్వం ఈ లక్షణాలకు సరిగ్గా సరిపోతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ, తన నటనతోనే అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సీతమ్మ పాత్రను ఎంచుకుని ఆ పాత్రకు ఇస్తున్న గౌరవం చూసి సినీ విశ్లేషకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 5న రిలీజ్ కానున్న రామాయణం పార్ట్ 1 సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


