Ramayana Collection: ఒక్కరోజే 83 కోట్లు- నితేష్ తివారీ రామాయణంకు 3 రోజుల్లో 375 కోట్లు- కానీ, ఇవాళ మాత్రం ఆ ఎఫెక్ట్!
Ramayana Box Office Collection Day 3: నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్లో వచ్చిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం స్వల్పంగా తగ్గినప్పటికీ, శనివారం 45 శాతం పుంజుకుని 3 రోజుల్లోనే రూ. 375.50 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
Ramayana 3 Days Worldwide Collection: భారతీయ చిత్రసీమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ: పార్ట్ 1' థియేటర్లలో కలెక్షన్ల జాతర సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 5న (గురువారం) విడుదలై మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

రెండో రోజు శుక్రవారం (నవంబర్ 6) కలెక్షన్లలో కొంత తగ్గుముఖం కనిపిచినా, శనివారం (నవంబర్ 7) నాటికి రికార్డు స్థాయి వసూళ్లతో పుంజుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది రామాయణం సినిమా.
బాక్సాఫీస్ వద్ద శనివారం ధమాకా
మూడు రోజుల వ్యవధిలోనే భారత్‌లో రామాయణ చిత్రం రూ. 182.70 కోట్ల నెట్ కలెక్షన్స్ (రూ. 218.25 కోట్ల గ్రాస్) రాబట్టింది. తొలి రోజు గురువారం (నవంబర్ 5) దేశవ్యాప్తంగా రూ. 64.85 కోట్ల నెట్ రాబట్టిన రామాయణం సినిమా శుక్రవారం నాటికి 25.9 శాతం తగ్గి రూ. 48.05 కోట్లకు పరిమితమైంది.
అయితే శనివారం రోజున ఏకంగా 45.3 శాతం అద్భుతమైన లీప్తో రూ. 69.80 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి తన సత్తా చాటింది. దీపావళి పండుగ పనుల హడావుడి ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే భారత్‌లో గ్రాస్ వసూళ్లు రూ. 83.45 కోట్లకు చేరుకోవడం విశేషం.
ఆక్యుపెన్సీలో మలయాళం టాప్.. తెలుగులోనూ జోరు
శనివారం రోజున హిందీ వెర్షన్ అత్యధికంగా రూ. 53 కోట్ల నెట్ వసూలు చేసింది. దక్షిణాది భాషల్లోనూ మంచి వసూళ్లు నమోదయ్యాయి. కన్నడలో రూ. 6.30 కోట్లు, తెలుగులో రూ. 6 కోట్లు, తమిళంలో రూ. 2.50 కోట్లు, మలయాళంలో రూ. 2 కోట్లు వచ్చాయి.
ఆశ్చర్యకరంగా మలయాళ వెర్షన్ ప్రదర్శించిన థియేటర్లలో అత్యధికంగా 83 శాతం సీట్లు నిండాయి. తమిళంలో 78.5 శాతం, కన్నడలో 66.5 శాతం, తెలుగులో 58 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, హిందీ వెర్షన్ 36.3 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నైలలో ఏకంగా 86 శాతం ఆక్యుపెన్సీ నమోదవ్వగా, బెంగళూరులో సాయంత్రం షోలకు 95 శాతం సీట్లు నిండటం విశేషం.
ఓవర్సీస్లోనూ విజృంభణ.. రూ. 4,000 కోట్ల ప్రాజెక్ట్
అంతర్జాతీయంగా కూడా 'రామాయణం' హవా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే విదేశీ బాక్సాఫీస్ నుంచి రూ. 60 కోట్లు వచ్చి చేరడంతో ఓవర్సీస్ మొత్తం 3 రోజుల గ్రాస్ రూ. 157.25 కోట్లకు పెరిగింది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అత్యధిక ఆదరణ లభిస్తుండగా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ కలెక్షన్లు జోరుగా ఉన్నాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు ముగిసేసరికి రామాయణం మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ. 375.50 కోట్లకు చేరుకుంది. రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండవ భాగం 2027 దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఇవాళ సండే నాడు దివాళి ఎఫెక్ట్
ఇవాళ ఆదివారం (నవంబర్ 8) నాటి దీపావళి వేడుకల వల్ల రాత్రి షోలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, సోమవారం పండుగ సెలవుదినం కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


