Top OTT Releases: ఈ వారం ఓటీటీలో మస్ట్ వాచ్ టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే.. దుల్కర్ మలయాళ థ్రిల్లర్ టు తమన్నా హారర్ మూవీ!

This Week Top OTT Releases: ఈ వారం ఓటీటీలో పండగే. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న టాప్ ఓటీటీ కంటెంట్ లిస్ట్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Nov 2, 2026, 12:51:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

This Week Top OTT Releases: ప్రతి వారం ఓటీటీలో క్రేజీ సినిమాల జాతర నడుస్తోంది. వీకెండ్ వస్తుందంటే చాలు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి టీవీ ముందు కూర్చుని సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడి మరీ కొత్త కంటెంట్ ను తీసుకొస్తున్నాయి. ఈ వారం ఏకంగా 9 క్రేజీ ప్రాజెక్టులు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మన ముందుకు రాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీలో మస్ట్ వాచ్ టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే.. దుల్కర్ మలయాళ థ్రిల్లర్ టు తమన్నా హారర్ మూవీ!
ఈ వారం ఓటీటీలో మస్ట్ వాచ్ టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే.. దుల్కర్ మలయాళ థ్రిల్లర్ టు తమన్నా హారర్ మూవీ!

సన్ నెక్స్ట్ లో ఊర మాస్ యాక్షన్

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు అనకాపల్లి (Anakapalli) సినిమా రెడీ అయింది. సన్ నెక్స్ట్ (SunNXT) ఓటీటీలో రాబోతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో మంచి బజ్ నడుస్తోంది. పక్కా ఊర మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కచ్చితంగా టాలీవుడ్ ఆడియన్స్ కు, యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లో వరల్డ్ క్లాస్ వెబ్ సిరీస్

ఇక ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి 'బ్లాక్ డోవ్స్ సీజన్ 2' (Black Doves S2) నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం బిగ్గెస్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. మొదటి సీజన్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో, యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంతో వస్తున్న రెండో సీజన్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. దీనికి తోడు బాలీవుడ్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం 'దిల్వాలీ దీవాళీ' (#DilwaliDiwali) కూడా నెట్‌ఫ్లిక్స్‌ లోనే స్ట్రీమింగ్ కు వస్తోంది.

సోనీ లివ్, జీ5, జియోహాట్‌స్టార్‌లో క్రేజీ కంటెంట్..

స్పోర్ట్స్, థ్రిల్లర్ జానర్లలో ఎప్పుడూ విభిన్నమైన కంటెంట్ ఇచ్చే జియోహాట్‌స్టార్ (JioHotstar) ఈ వారం ఐయామ్ గేమ్ మూవీని తీసుకొస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ పై హైప్ నెలకొంది.

అలాగే యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజికల్ హిట్ 'మీసయ మురుక్కు 2' (Meesaya Murukku 2) సోనీ లివ్ (SonyLIV) లో సందడి చేయనుంది. కోలీవుడ్ నుంచి వస్తున్న మరో ఫీల్ గుడ్ డ్రామా 'నూరు కోడి వానవిల్' (#NooruKodiVaanavil) జీ5 (ZEE5) వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది.

రెంట్ విధానంలో యాక్షన్ చిత్రాలు

కొన్ని క్రేజీ హాలీవుడ్, పాన్ ఇండియా చిత్రాలు డైరెక్ట్ గా ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా ముందుగా రెంటల్ విధానంలో వస్తుంటాయి. అలా ఈ వారం అమెజాన్ ప్రైమ్ (Prime Video - RENT) లో ది వాన్ (TheVvaan) అందుబాటులోకి రాబోతోంది. తమన్నా హీరోయిన్ గా నటించిన హారర్ థ్రిల్లర్ ఇది.

ఇక యాక్షన్ లవర్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ‘రెసిడెంట్ ఈవిల్’ (Resident Evil) తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రైమ్ టైమ్’ (PrimeTime) సినిమాలు పీవీఓడీ (PVOD) లో అందుబాటులోకి రానున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ కి మీ వాచ్ లిస్ట్ రెడీ చేసుకోండి!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More