Ranabaali OTT Release Date: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ రణబాలి.. నెట్‌ఫ్లిక్స్ చిన్న పొరపాటుతో స్ట్రీమింగ్ డేట్ లీక్!

Ranabaali OTT Release Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను పొరపాటున లీక్ చేసి వెంటనే డిలీట్ చేసింది. 

Published on: Nov 2, 2026, 09:35:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ranabaali OTT Release Date: థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'రణబాలి' సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'రణబాలి' ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.

ఓటీటీలోకి విజయ్ దేవరకొండ రణబాలి.. నెట్‌ఫ్లిక్స్ చిన్న పొరపాటుతో స్ట్రీమింగ్ డేట్ లీక్! (x/MythriOfficial)
ఓటీటీలోకి విజయ్ దేవరకొండ రణబాలి.. నెట్‌ఫ్లిక్స్ చిన్న పొరపాటుతో స్ట్రీమింగ్ డేట్ లీక్! (x/MythriOfficial)

రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుతో రణబాలి మూవీ స్ట్రీమింగ్ డేట్ లీక్ అయింది. సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్టు పెట్టింది. అయితే ఏమైందో ఏమో కానీ, పెట్టిన కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే కొందరు నెటిజన్లు ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

ఆ డిలీట్ చేసిన పోస్ట్ ప్రకారం నవంబర్ 13, 2026న రణబాలి సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మల్టీపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి విడుదలైన మొదటి రోజు కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే రాను రాను మౌత్ టాక్‌తో పుంజుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది.

80 కోట్ల కలెక్షన్లు

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

హ్యాట్రిక్ కొట్టిన విజయ్-రష్మిక జోడీ

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడోసారి జంటగా నటించిన చిత్రమిది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ 'రణబాలి' సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

పెళ్లి తర్వాత

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత కలిసి నటించిన ఫస్ట్ మూవీ రణబాలి. విజయ్ తన పీరియాడిక్ క్యారెక్టర్‌లో జీవించాడని, సరికొత్త లుక్‌లో అదరగొట్టాడని ప్రశంసలు దక్కాయి. అలాగే సూపర్ హిట్ 'టాక్సీవాలా' తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి, దానికి తగ్గట్టే సినిమా మెప్పించింది.

ఓటీటీలోనూ

రణబాలి సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆయనతో పాటు ఈశ్వరీ రావు, మలయాళ నటుడు లాల్, వినోద్ సాగర్, మధునందన్, పోలిమేర కిషోర్ కుమార్ తదితరులు తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

మరాఠీ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన సంగీతం, పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోశాయి. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుండటంతో.. ఓటీటీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూవర్‌షిప్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More