Vijay Deverakonda: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగింది.. రష్మిక సీక్రెట్ బయటపెట్టిన విజయ్ దేవరకొండ.. మ్యారేజ్ ఫార్ములా
Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విరోష్ జోడీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట ఎక్కడ కనిపించినా సందడే సందడి. తాజాగా కాఫీ విత్ కరణ్ ఓటీటీ షోలో విజయ్ దేవరకొండ ఓ సీక్రెట్ బయటపెట్టాడు. హ్యాపీ మ్యారేజీ లైఫ్ సీక్రెట్ కూడా చెప్పాడు.
Vijay Deverakonda: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ క్రేజీ జంట మొదటిసారిగా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9) లో సందడి చేశారు.

విరోష్ లవ్ స్టోరీ
హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ లవ్ స్టోరీ, మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
100 సార్లు అడిగింది
షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్ ఈ కొత్త దంపతులను పలకరిస్తూ.. "మీ ఇద్దరిలో మొదటగా పెళ్లి ప్రపోజల్ ఎవరు తెచ్చారు? విజయ్ నీకు ఏమైనా గ్రాండ్‌గా ప్రపోజ్ చేశాడా?" అని రష్మిక మందన్నను ప్రశ్నించారు. దానికి రష్మిక నవ్వుతూ తల అడ్డంగా తిప్పింది. వెంటనే విజయ్ దేవరకొండ మైక్ అసలు సీక్రెట్ లీక్ చేశాడు.
"తనే నా దగ్గరకు వచ్చి 'మనం పెళ్లి చేసుకుందాం' అని అంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 సార్లు నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది" అని విజయ్ సరదాగా కామెంట్ చేశాడు.
ఏడాది పాటు తిరిగా
విజయ్ 100 సార్లు అని చెప్పగానే కరణ్ జోహార్ ఆశ్చర్యపోతూ రష్మిక వైపు చూశాడు. దానికి రష్మిక స్పందిస్తూ.. "అవును, నేను నిజంగానే పెళ్లి కోసం అతనిని ఒప్పించడానికి ఒక సంవత్సరం పాటు అడుగుతూనే ఉన్నాను" అని ఒప్పుకుంది. రష్మిక సమాధానానికి విజయ్ కౌంటర్ ఇస్తూ.. "చూశారా! తనే నన్ను వందసార్లు అడిగింది. అందుకే నేను సరే అన్నాను. నేనేం అంత బ్యాడ్ పర్సన్‌ని కాదు" అని నవ్వుతూ చెప్పడంతో సెట్‌లో నవ్వులు పూశాయి.
హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఇదే
ఇక పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందనే విషయంపై విజయ్ దేవరకొండ ఒక క్రేజీ ఫార్ములాను పంచుకున్నాడు. "సంతోషకరమైన మ్యారేజ్ లైఫ్ గడపాలి అంటే ఒకే ఒక సూత్రం ఉంది. భార్య ఏం చెప్పినా ఎల్లప్పుడూ అవునని అంగీకరించడమే. అందరు భర్తల్లాగే నేను కూడా భార్య మాట వింటాను" అని విజయ్ చెప్తుండగా పక్కనే ఉన్న రష్మిక మురిసిపోయింది.
అల్లు అర్జున్ వర్సెస్ రణ్‌బీర్ కపూర్
ఈ ఎపిసోడ్‌లో కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌పై కూడా ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ రౌండ్ సాగింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పరంగా 'పుష్ప' కో-స్టార్ అల్లు అర్జున్, 'యానిమల్' కో-స్టార్ రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటావు అని కరణ్ అడగ్గా.. రష్మిక ఏమాత్రం ఆలోచించకుండా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వైపే మొగ్గు చూపింది.
ఈ మోస్ట్ అవేటెడ్ సెలబ్రిటీ ఎపిసోడ్ అక్టోబర్ 21న బుధవారం రాత్రి 7 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


