Rashmika Mandanna: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. నా భర్త విజయం నాది: రష్మిక మందన్న

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పీరియాడిక్ ఎపిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ తో తన భర్త విజయ్ దేవరకొండను పోలుస్తూ రష్మిక మందన్న వ్యాఖ్యలు చేసింది. 

Published on: Oct 17, 2026, 19:39:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rashmika Mandanna: ‘రణబాలి' చిత్రంలో విజయ్ దేవరకొండ కనబరిచిన నటనపై రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. ప్రెస్ మీట్‌లో రష్మిక మాట్లాడుతూ.. "తెరపై రణబాలి పాత్రను చూస్తున్నప్పుడు విజయ్‌కి, రణబాలికి అస్సలు సంబంధమే లేనట్లు అనిపించింది’’ అని పేర్కొంది.

అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. నా భర్త విజయం నాది: రష్మిక మందన్న (x/iamRashmika)
అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. నా భర్త విజయం నాది: రష్మిక మందన్న (x/iamRashmika)

విజ్జు ఎక్కడికి వెళ్లాడా?

‘‘సెట్స్‌లో షూటింగ్ గ్యాప్‌లో మాట్లాడితే కూడా ఆయన రణబాలిలాగే ఉండేవాడు. దీంతో నా విజ్జు ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచించేదాన్ని. ఒక పాత్ర నటుడిని ఎంతగా ఆవహిస్తుందో ఈ సినిమాతో నాకు అర్థమైంది" అని రష్మిక మందన్న తన భర్త విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించింది.

అప్పుడు అల్లు అర్జన్

ఇదే తరహా అనుభవాన్ని తనకు అల్లు అర్జున్ అందించారని రష్మిక గుర్తు చేసుకున్నారు. "'పుష్ప 2: ది రూల్' చేస్తున్నప్పుడు బన్నీ సర్ (అల్లు అర్జున్) విషయంలోనూ నేను ఇలాంటి అనుభవాన్నే చూశా.

అప్పుడు బన్నీ సర్ వేరు, పుష్పరాజ్ వేరు. ఇప్పుడు విజయ్‌లోనూ అదే డెడికేషన్ చూశా. గతంలో మేమిద్దరం కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేశాం. కానీ 'రణబాలి'లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ నన్ను బాగా కదిలించింది. ఇది కచ్చితంగా ఆయన వన్-మ్యాన్ షో" అని రష్మిక మందన్న కొనియాడింది.

భర్త విజయం నాది కూడా

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండను బహిరంగంగా 'భర్త' అని ప్రస్తావిస్తూ రష్మిక వ్యాఖ్యానించారు. విజయ్ సాధించిన ఈ విజయంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. "మేమిద్దరం ఇప్పుడు ఒకటే. మా మధ్య బాధ, సంతోషం, అనుభవాలు అన్నీ ఒక్కటే.

చాలా కాలం కిందటే మేమిద్దరం వేర్వేరు వ్యక్తులం కాదనే భావనకు వచ్చాం. కాబట్టి ఆయన విజయం నాది, నా విజయం ఆయనది. జీవితాంతం మా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లు కావాలని కోరుకుంటున్నా" అని రష్మిక భావోద్వేగంగా సమాధానమిచ్చారు.

రణబాలి బోణీ

ట్రేడ్ వర్గాలు, సాక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం, 'రణబాలి' చిత్రం తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూ.9.25 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రూ.16.15 కోట్లుగా ఉన్నాయి.

రణబాలి మూవీకి మిక్స్ డ్ రియాక్షన్లు వచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్, ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ విలనిజం, రష్మిక కాంబినేషన్ క్రేజ్ కారణంగా ఓవర్సీస్ అండ్ నైజాం బెల్ట్‌లో ఫస్ట్ డే హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More