OTT Weekend: క్రేజీ లైనప్-ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు చూస్తే వావ్ అనాల్సిందే-నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-వీకెండ్ వాచ్

OTT Telugu Weekend: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదం ఖాయం! వీకెండ్ రానే వచ్చింది.. ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, జీ5లలో యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ కథలతో అద్భుతమైన తెలుగు సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Oct 31, 2026, 18:48:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Telugu Weekend: వీకెండ్ వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే మూడ్ లేదా? ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వారం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు మీకోసం అదిరిపోయే తెలుగు లైనప్‌ను సిద్ధం చేశాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

క్రేజీ లైనప్-ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు చూస్తే వావ్ అనాల్సిందే-నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-వీకెండ్ వాచ్
క్రేజీ లైనప్-ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు చూస్తే వావ్ అనాల్సిందే-నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-వీకెండ్ వాచ్

నెట్‌ఫ్లిక్స్‌లో డబుల్ ధమాకా

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం యాక్షన్ ప్రియుల కోసం రెండు క్రేజీ చిత్రాలతో మన ముందుకు వచ్చింది. అందులో మొదటిది 'సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్' (Sub-Inspector : YUGANDHAR). అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ఇక దీనికి తోడు మరో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Dont Trouble The Trouble) కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మాస్ యాక్షన్ లవర్స్ కు ఈ రెండు సినిమాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ప్రైమ్ వీడియోలో ‘కామ్రేడ్ కళ్యాణ్’

అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) వేదికగా 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా ఈ వారం డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 30న ప్రైమ్ లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. శ్రీ విష్ణు మరోసారి తన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. ఫ్యామిలీతో కలిసి చూసే ఫన్ ఎంటర్ టైనర్ మూవీ ఇది.

ఈటీవీ విన్‌లో ‘తెల్ల కాగితం’

తెలుగు వారి సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) విభిన్నమైన కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వారం 'తెల్ల కాగితం' అనే ఇంట్రెస్టింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అక్టోబర్ 29 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంది. టీనేజీ లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా గా ఈ మూవీ తెరకెక్కింది.

జీ5లో ఉత్కంఠ రేపుతున్న ‘రుద్రవనం పీఎస్’

సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడే వారి కోసం జీ5 (Zee5) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 'రుద్రవనం పీఎస్' అనే సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ, బింజ్ వాచ్ చేయడానికి అద్భుతంగా రూపొందింది.

చూశారుగా.. ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న లైనప్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో! యాక్షన్ కావాలంటే నెట్‌ఫ్లిక్స్.. సస్పెన్స్ థ్రిల్లర్ కోసం జీ5.. ఫ్యామిలీ డ్రామా కోసం ఈటీవీ విన్.. ఇలా మీ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు, సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన సినిమాను ప్లే చేసి ఈ వీకెండ్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More