Nagarjuna Netflix: బర్త్ డే వేళ నాగార్జున ఫ్యాన్స్ కు నెట్‌ఫ్లిక్స్ షాక్..ఓటీటీ నుంచి ఆ సీక్వెల్ మూవీ ఔట్..లాస్ట్ డేట్!
Nagarjuna Netflix: అక్కినేని నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్న ఫ్యాన్స్ కు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దిమ్మతిరిగే షాకిచ్చింది. నాగార్జున సినిమాను ఓటీటీ నుంచి తొలగించనుంది. ఆ సీక్వెల్ మూవీని చూసేందుకు లాస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేసేసింది.
Nagarjuna Netflix: అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందడి వేళ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మన్మథుడు 2' సెప్టెంబర్ 22, 2026న నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. నాగార్జున తన పుట్టినరోజును ఆగస్టు 29, 2026న జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లయింది.

నాగార్జున 100వ సినిమా
నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం (#King100) కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్ వెలువడుతుందనే ఆశతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఉత్సాహంతో ఉన్నారు. ఒకవైపు ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, మరోవైపు ఆయన నటించిన సీక్వెల్ మన్మథుడు 2 సినిమాకు సంబంధించి ఓటీటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘మన్మథుడు 2’
నాగార్జున హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'మన్మథుడు 2' ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుంచి త్వరలోనే వైదొలగనుంది. సెప్టెంబర్ 22, 2026న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కేటలాగ్ నుంచి పూర్తిగా తొలగిపోనుంది. 2002లో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన క్లాసిక్ ఫిల్మ్ 'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 వచ్చింది.
ఇప్పటివరకు మన్మథుడు 2 సినిమాను చూడని వారికి లేదా మళ్లీ వీక్షించాలనుకునే అక్కినేని అభిమానులకు సెప్టెంబర్ 22 వరకు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో చూసే అవకాశం ఉంది.
మన్మథుడు 2 గురించి
మన్మథుడు 2 సినిమాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై వైకమ్ 18 స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. నాగార్జున సరసన గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అలరించింది.
అంతేకాకుండా, సౌత్ స్టార్ హీరోయిన్లు సమంతా రూత్ ప్రభు, కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రత్యేక అతిథి (కామియో) పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, పాటలు అందించారు. అయితే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. క్లాసిక్ మూవీ మన్మథుడు సీక్వెల్ అని పేరు పెట్టి మూవీని చెడగొట్టారనే విమర్శలు వచ్చాయి.
నాగార్జున పుట్టినరోజు నాటికి ఆయన 100వ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో, అభిమానులు ఒకవైపు పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే, నెట్‌ఫ్లిక్స్‌లో చివరి రోజుల్లో ఉన్న 'మన్మథుడు 2'ను మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


