Nagarjuna: భట్టి విక్రమార్క మాటలతోనే ఈ సినిమా.. తెలంగాణ కల్చర్.. కొత్త కథలు ఉంటే వచ్చేయండి.. నేను వింటా: నాగార్జున
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న తెలంగాణ రూటెడ్ ఫ్యామిలీ డ్రామా ‘పళ్ళబురుసు’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అలాగే అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.
Nagarjuna: ఓ వైపు హీరోగా సినిమాలు తీస్తూనే.. మరోవైపు మూవీస్ నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ బిజీ అయిపోయారు కింగ్ నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘పళ్లబురుసు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. ఈ మూవీ ఆలోచనను ఈ సందర్భంగా కింగ్ పంచుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్
అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని, నాన్న (ANR) కాలంనాటి పద్ధతిలోనే డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని బలోపేతం చేస్తూ మళ్లీ మొదలుపెట్టామని కింగ్ నాగార్జున తెలిపారు. ఈ క్రమంలోనే ‘పళ్ళబురుసు’ సినిమా చేయడానికి వెనుక ఉన్న ఆసక్తికర కథనాన్ని ఆయన పంచుకున్నారు.
భట్టి విక్రమార్క మాటలతో
"నా కెరీర్‌లో ఇప్పటివరకు ఆంధ్రా సంస్కృతి, యాస నేపథ్యంలో ఎన్నో సినిమాలు చేశాను, నిర్మించాను. అయితే గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నపూర్ణ కాలేజ్ అండ్ స్టూడియోస్‌ను సందర్శించినప్పుడు నాతో ఒక మాట చెప్పారు.
'తెలంగాణ మట్టి సువాసన, ఇక్కడి కల్చర్ అండ్ ఎమోషన్స్ ప్రతిబింబించేలా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక మంచి సినిమా రావాలి' అని ఆయన కోరారు. ఆ మాట నా మనసులో ఒక విత్తనం నాటింది. నాటి నుంచి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మంచి కథ కోసం వెతుకుతున్న సమయంలోనే ఈ కథ వచ్చింది" అని నాగార్జున స్పష్టం చేశారు.
నాగార్జున బిగ్ ఆఫర్
పళ్ల బురుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కొత్త తరం టాలెంట్ మరియు యంగ్ డైరెక్టర్లకు నాగార్జున ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
"మీ దగ్గర వినూత్నమైన కథలు, సరికొత్త కాన్సెప్ట్‌లు ఉంటే నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌కు రండి. మంచి కథలను, నూతన దర్శకులను ప్రోత్సహించడానికి, నిర్మించడానికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది. నా టీమ్ కథ విన్నాక నచ్చితే, నేను కూడా వింటా" అని నాగార్జున నూతన మేకర్స్‌కు పిలుపునిచ్చారు.
తండ్రీకొడుకుల ఎమోషనల్ రైడ్
ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పళ్లబురుసు చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తండ్రీకొడుకుల అనుబంధం, నవ్వులు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఇటీవలే విడుదలైన పళ్ళబురుసు టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ సినిమా అందరి మనసులను ఆకట్టుకుంటుందని నాగ్ ధీమా వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


