Malayalam Thriller OTT: కోమాలో నుంచి కోలుకున్నాక అతీంద్రియ శక్తులు.. ఓటీటీలోకి తెలుగులో దుల్కర్ మలయాళ ఫాంటసీ థ్రిల్లర్!

Malayalam Thriller I'm Game OTT: దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో సహా మొత్తం ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ వివరాలపై లుక్కేయండి.

Published on: Oct 31, 2026, 15:35:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Malayalam Thriller I'm Game OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఐయామ్ గేమ్' కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.

కోమాలో నుంచి కోలుకున్నాక అతీంద్రియ శక్తులు.. ఓటీటీలోకి తెలుగులో దుల్కర్ మలయాళ ఫాంటసీ థ్రిల్లర్!
కోమాలో నుంచి కోలుకున్నాక అతీంద్రియ శక్తులు.. ఓటీటీలోకి తెలుగులో దుల్కర్ మలయాళ ఫాంటసీ థ్రిల్లర్!

ఐయామ్ గేమ్ ఓటీటీ

“ఆట మొదలవ్వబోతోంది!” అంటూ మేకర్స్ ఐయామ్ గేమ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, అలాగే మరోసారి ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

డిజిటల్ ఆడియన్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) ఐయామ్ గేమ్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓటీటీలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఓటీటీలో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు.

మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా నవంబర్ 6 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. “డోంట్ మిస్ ఇట్” అని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

'ఐయామ్ గేమ్' సినిమా కథేంటంటే?

'ఆర్డీఎక్స్' (RDX) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 3, 2026న థియేటర్లలో విడుదలైంది. డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) అనే జూదానికి బానిసైన ఒక యువకుడు, తనకున్నదంతా కోల్పోయి ఊహించని పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు.

ఆ తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాక అతనికి ఎదురైన ఫాంటసీ ఎలిమెంట్స్, అతీంద్రియ శక్తులు, సర్వైవల్ కోసం అతను చేసిన పోరాటమే ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ తనదైన స్టైలిష్ యాక్షన్‌తో ఈ సినిమాలో అదరగొట్టాడు.

ఆకట్టుకునే యాక్షన్

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో పాటు కాయదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అన్బరివ్ స్టంట్ కొరియోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఫాంటసీ అంశాలు, క్రైమ్, యాక్షన్ కలగలిపిన ఈ డిఫరెంట్ కథ ఓటీటీ ఆడియన్స్‌కు కచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో మీ ఇంట్లోనే ఈ 'ఆట'ను ఆస్వాదించండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More