OTT Mystery Thriller: క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో బ్లాక్ మ్యాజిక్ ట్విస్ట్‌.. ఓటీటీ షేక్.. 50 మిలియ‌న్ వ్యూస్ రికార్డు

OTT Mystery Thriller: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీలో అదరగొడుతోంది. అక్టోబర్ 22న నేరుగా ఆహా ఓటీటీలో డిజిటల్ రిలీజైన ఈ సినిమ ఏకంగా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ఓటీటీ రికార్డులను బద్దలు కొడుతోంది.

Published on: Oct 26, 2026, 14:53:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Mystery Thriller: దాదాపు రెండు దశాబ్దాల క్రితం 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన క్యూట్ పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ జంటగా నటించిన మూవీ 'నా వైఫ్ మిస్సింగ్' (Naa Wife Missing). అయితే ఈ సారి లవ్ స్టోరీతో కాకుండా మైండ్ బ్లాంక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చారు.

క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో బ్లాక్ మ్యాజిక్ ట్విస్ట్‌.. ఓటీటీ షేక్.. 50 మిలియ‌న్ వ్యూస్ రికార్డు
క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో బ్లాక్ మ్యాజిక్ ట్విస్ట్‌.. ఓటీటీ షేక్.. 50 మిలియ‌న్ వ్యూస్ రికార్డు

నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వరుణ్ సందేశ్.. ఇందులో భార్య ప్రవర్తనతో నలిగిపోయే ఎమోషనల్ బ్యాంక్ ఉద్యోగి (బాలు) పాత్రలో తన కంప్లీట్ మేకోవర్ చూపించాడు. శ్వేతా బసు (స్వప్న) కూడా ఎమోషనల్ రోల్ లో తన అద్భుతమైన నటనతో మూవీకి ప్రాణం పోసింది.

50 మిలియన్ల వ్యూస్ తో ప్రభంజనం

సాధారణంగా చిన్న సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. ఈ ఫార్ములాను నమ్మి అక్టోబర్ 22న 'ఆహా' యాప్ లో డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ గా నా వైఫ్ మిస్సింగ్ సినిమాను రిలీజ్ చేశారు. మేకర్స్ నమ్మకం ఏమాత్రం వమ్ము కాలేదు. మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో కేవలం కొన్ని రోజుల్లోనే ఈ మూవీ 50 మిలియన్ల వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి ఆహా ఓటీటీలో సెన్సేషన్ గా మారింది.

థ్రిల్లింగ్ కథ.. ఊహించని ట్విస్టులు

ఈ సినిమా కథ విషయానికి వస్తే మొదటి నుంచే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న స్వప్న.. ఫస్ట్ నైట్ రోజే తను వర్జిన్ కాదు అని భర్త బాలుతో చెబుతుంది. ఒకవైపు భర్తతో ఉంటూనే, పెళ్లికి ముందు ప్రేమించిన అబాన్ అనే యువకుడితో ఎఫైర్ కొనసాగిస్తుంది. ఇదంతా కనిపెట్టిన బాలు ఓ రోజు వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు.

ఆ తర్వాత స్వప్న అనుమానాస్పద స్థితిలో మిస్సవుతుంది. నా భార్య కనిపించడం లేదు అంటూ నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు బాలు. అసలు స్వప్న ఏమైంది? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? అనేదే ఈ సినిమా. దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ ఫ్యామిలీ క్రైమ్ స్టోరీకి బ్లాక్ మ్యాజిక్ (క్షుద్ర పూజలు) యాంగిల్ జోడించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ఓటీటీ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ చాయిస్

సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారికి 'నా వైఫ్ మిస్సింగ్' ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ప్రవీణ్, జబర్దస్త్ సత్యశ్రీ కామెడీ, సాయి కార్తీక్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యాయి. లాగ్ లేకుండా చాలా క్రిస్ప్ రన్ టైమ్ తో రూపొందిన ఈ సినిమాను ఎలాంటి బోర్ కొట్టకుండా చూసేయొచ్చు. ఇప్పటివరకు ఈ థ్రిల్లర్ మూవీని చూడకపోతే వెంటనే ఆహా ఓటీటీలో చూసేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More