Sunny Deol Suryaa: సన్నీ డియోల్ మూవీకి షాక్.. బ్యాన్ చేయాలని డాక్టర్ల డిమాండ్.. ఆ క్రైమ్ థ్రిల్లర్ పరిస్థితి ఏంటీ?

Sunny Deol Suryaa: స్టార్ హీరో సన్నీ డియోల్ అప్ కమింగ్ మూవీ ‘సూర్య’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. రిలీజ్ కు ముందే ఈ మూవీ చుట్టూ కాంట్రవర్సీ అల్లుకుంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఏం జరిగింది? అనే పూర్తి వివరాలు చూసేయండి. 

Published on: Oct 24, 2026, 14:47:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sunny Deol Suryaa: బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ సరికొత్త చిత్రం 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' (Suryaa: Ant Se Aarambh Tak) విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 19, 2026న సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అయితే, ఇందులో వైద్య వృత్తిని, ఆరోగ్య రంగాన్ని నెగెటివ్ గా చూపించారనే విమర్శలు వస్తున్నాయి.

సన్నీ డియోల్ మూవీకి షాక్.. బ్యాన్ చేయాలని డాక్టర్ల డిమాండ్.. ఆ క్రైమ్ థ్రిల్లర్ పరిస్థితి ఏంటీ?
సన్నీ డియోల్ మూవీకి షాక్.. బ్యాన్ చేయాలని డాక్టర్ల డిమాండ్.. ఆ క్రైమ్ థ్రిల్లర్ పరిస్థితి ఏంటీ?

అసలు వివాదం ఏంటి?

'సూర్య' చిత్రం టీజర్‌లో సన్నీ డియోల్ ఒక వ్యక్తిగత విషాదం తర్వాత, వైద్య వ్యవస్థలోని లోపాలు, లంచగొండితనాన్ని ప్రశ్నించే పాత్రలో కనిపించారు. వైద్యులను దేవుడి రూపంగా భావిస్తారని, కానీ కొందరు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజుతూ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే డైలాగులతో టీజర్ సాగింది. డాక్టర్లు రాసేది ప్రిస్కిప్షన్ కాదు కమీషన్లు అనే సంచలన డైలాగ్ కూడా ఉంది.

డాక్టర్లు ఫైర్

సూర్య మూవీ టీజర్ పై డాక్టర్లు ఫైర్ అవుతున్నారు. సమాజంలో ఒకరిద్దరు చేసే తప్పులను చూపించి, మొత్తం వైద్య వృత్తికే అవినీతి అపవాదును అంటగట్టేలా ఈ టీజర్ ఉందని మండిపడుతున్నారు. అంతేకాకుండా, ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు. ఇతర సిబ్బందిపై జరిగే భౌతిక దాడులను హీరోయిజంగా, ఎంకరేజ్ చేసేలా చూపించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి మెడికల్ అసోసియేషన్

ఈ వివాదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi) రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా స్పందించాయి. వైద్యులు నిరంతరం రోగులను రక్షించేందుకు శ్రమిస్తారని, వారిని కించపరిచేలా చూపించడం సరికాదని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఐఎంఏ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అత్యవసర లేఖ రాసింది.

బ్యాన్ చేయాలని

వైద్య రంగంలో అవినీతిని ప్రశ్నించడాన్ని తాము తప్పుపట్టడం లేదని డాక్టర్లు అన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్పా ఇలా సినిమాల్లో వైద్యులపై హింసను ప్రేరేపించడం వల్ల సమాజంలో డాక్టర్-రోగి మధ్య ఉండే నమ్మకమైన బంధం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు.

వైద్యులపై దాడులను నార్మలైజ్ చేసేలా ఉన్న ఈ సూర్య సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ను తక్షణమే రివ్యూ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చిత్ర యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ మార్పులు చేయాలన్నారు. లేనిపక్షంలో సినిమాపై నిషేధం విధించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.

రిలీజ్ ఎప్పుడు?

ఈ వివాదంపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC).. సూర్య చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. ఎమ్. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ వివాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More