Suryaa Teaser: డాక్టర్లు రాసేది మందులు కాదు కమిషన్లు, మెడికల్ మాఫియాపై విరుచుకుపడ్డ తండ్రి- అదిరిపోయిన సూర్యా టీజర్

Sunny Deol Suryaa Teaser Released: బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇన్వెస్టిగేటివ్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ 'సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్' టీజర్ తాజాగా ఇవాళ విడుదలైంది. కూతురు మృతి వెనుక ఉన్న వైద్యరంగ అక్రమాలను బయటపెట్టే నిజాయితీ గల పోలీసు, తండ్రి పాత్రలో ఆయన కనిపిస్తున్నారు.

Published on: Oct 19, 2026, 14:18:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sunny Deol Suryaa Teaser Released: 'గదర్ 2' సునామీ తర్వాత బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ మరో శక్తివంతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్'.

డాక్టర్లు రాసేది మందులు కాదు కమిషన్లు, మెడికల్ మాఫియాపై విరుచుకుపడ్డ తండ్రి- అదిరిపోయిన సూర్యా టీజర్
డాక్టర్లు రాసేది మందులు కాదు కమిషన్లు, మెడికల్ మాఫియాపై విరుచుకుపడ్డ తండ్రి- అదిరిపోయిన సూర్యా టీజర్

సూర్యా టీజర్ రిలీజ్

ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ తర్వాత మేకర్స్ సూర్యా టీజర్‌ను రిలీజ్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌లో సన్నీ డియోల్ ఉద్వేగభరితమైన నటనతో ఆకట్టుకున్నారు.

కూతురు మరణం.. వైద్య రంగంలో మాఫియా దందా!

కుటుంబంతో సంతోషంగా గడిపే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ జీవితం కూతురి ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలను శోధిస్తున్న కొద్దీ, దేశంలోని వైద్యవ్యవస్థలో దాగి ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి.

"డాక్టర్ దేవుడితో సమానమని నమ్మి రోగి తన ప్రాణాలను వారి చేతుల్లో పెడతాడు. అలాంటి వైద్యుడే ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కితే ఆ మనిషి ఏం చేయాలి?" అని టీజర్‌లో సన్నీ డియోల్ ప్రశ్నించే తీరు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

అవసరం లేకపోయినా పరీక్షలు

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా భారీ బిల్లులు వసూలు చేస్తూ, అవసరం లేకపోయినా రకరకాల పరీక్షలు రాసే కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై కథానాయకుడు గళమెత్తారు.

"అక్కడ డాక్టర్లు మందుల ప్రిస్క్రిప్షన్లు రాయడం లేదు, తమ కమిషన్ల లెక్కలు రాస్తున్నారు. ప్రజలు దీన్ని సహిస్తున్నారు.. కానీ ఎంతకాలం?" అంటూ సన్నీ డియోల్ చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఆసుపత్రుల్లో ఎదుర్కొంటున్న నిజమైన నరకానికి ఈ చిత్రం అద్దం పడుతోంది.

మలయాళ హిట్ 'జోసెఫ్' రీమేక్!

సూర్యా చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు ఎమ్ పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో మలయాళంలో జోజూ జార్జ్ కథానాయకుడిగా సంచలన విజయం సాధించిన 'జోసెఫ్' చిత్రానికి ఇది అధికారిక హిందీ రీమేక్.

మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ కథను హిందీలో తొలిసారి తెరకెక్కిస్తూ పద్మకుమార్ బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్నారు. కమల్ ముకుత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన టాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవికిషన్, సౌమ్యా టాండన్, జిష్షూ సేన్‌గుప్తా, తిను ఆనంద్, మనీష్ వాధ్వా, దివంగత పంకజ్ ధీర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!

సామాన్యుడి బాధను, అన్యాయంపై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఈ కథను తీర్చిదిద్దినట్లు నిర్మాత కమల్ ముకుత్ తెలిపారు. సన్నీ డియోల్ సినీ ప్రయాణంలో మూడు వేర్వేరు దశలను ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు మేకర్స్ వెల్లడించారు.

"అతని ముగింపు అని అందరూ అనుకున్నారు, కానీ సూర్యాకి ఇది కేవలం ఆరంభం మాత్రమే! జాగ్రత్తగా ఉండండి.. అన్యాయం జరిగితే తిరగబడండి" అంటూ సన్నీ డియోల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ భారీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 2026 నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More