OTT Today Top: ఓటీటీలో ఇవాళ మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 6 సినిమాలు- అన్నీ తెలుగులోనే- సూర్య టు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్!
Friday Top OTT Releases Telugu Today: ఇవాళ ఓటీటీ ప్రియులకు వినోదాల విందు సిద్ధమైంది. సూర్య, వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన 'విశ్వనాథ్ & సన్స్' నుంచి మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వరకు ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 6 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్నీ తెలుగులో ఓటీటీ రిలీజైన ఆ సినిమాలేంటో చూద్దాం.
Top OTT Release Movies Telugu Today: వీకెండ్ వచ్చిందంటే చాలు డిజిటల్ ప్రియులు ఓటీటీలో ఏ కొత్త సినిమాలు వస్తున్నాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ఓటీటీ వీక్షకులను అలరించేందుకు ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11) చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 సినిమాలు
వాటిలో మిస్ అవకుండా చూడాల్సన టాప్ 6 సినిమాలు, అది కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబ కథా చిత్రం నుంచి ఉత్కంఠ రేకెత్తించే తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య 'విశ్వనాథ్ & సన్స్'
తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్'. థియేటర్లలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 11న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సంజయ్ విశ్వనాథ్ అనే పారిశ్రామికవేత్త క్రమశిక్షణతో కూడిన జీవితంలోకి, మ్యాడీ అనే మెడికల్ విద్యార్థిని అడుగుపెట్టిన తర్వాత వారి కుటుంబంలో చోటుచేసుకున్న మార్పుల చుట్టూ ఈ కథ సాగుతుంది. సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
2. జీ5లో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ 'పంచనామా'
సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారి కోసం పంచనామా జీ5 ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ఒక చిన్నారి అనుమానాస్పద మృతి కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ జై పాత్రలో భరత్ శ్రీనివాసన్ నటించారు. కేసును మూసివేసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ, దాని వెనుక ఉన్న మెడికల్ క్రైమ్, బడా బాబుల హస్తాన్ని బయటకు తీసేందుకు జై చేసే పోరాటమే ఈ సినిమా. మోహన్ శ్రీవత్స ఈ తెలుగు థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు.
3. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశాల్ 'మకుటం'..
యాక్షన్ ప్రియుల కోసం తమిళ హీరో విశాల్ నటించి, దర్శకత్వం వహించిన 'మకుటం' సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో లింగ, కిరుబ అనే తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో విశాల్ కనిపించారు. ఒక విషాదకర సంఘటన తర్వాత తండ్రీకొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ఈ కథకు ప్రాణం పోశాయి. ఇందులో దుషారా విజయన్, అంజలి హీరోయిన్స్‌గా నటించారు.
4. ఈటీవీ విన్‌లో 'కొలవెరి'
మరోవైపు, అచ్చమైన తెలుగు కంటెంట్‌తో అలరిస్తున్న ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో 'కొలవెరి' అనే మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు హైకింగ్‌కు వెళ్లిన విక్రమ్ జీవితంలోకి ఊహించకుండా మాజీ ప్రేమికురాలు రావడంతో ఏం జరిగిందనే ఆసక్తికర పాయింట్‌తో కృష్ణ పూజిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రవితేజ ముక్కవల్లి, శ్రావ్య సామల ఇందులో జంటగా నటించారు.
5. మలయాళ వినోదం ‘వరవు’
మలయాళ చిత్రాలకు మన దగ్గర కూడా విపరీతమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే జోజు జార్జ్ ప్రధాన పాత్రలో షాజీ కైలాస్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'వరవు' జీ5 ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌గా వచ్చేసింది. కుటుంబంలో జరిగిన ఒక అదృశ్యం, పాత శత్రుత్వాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి 4 భాషల్లో జీ5లో వరవు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
6. ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ ఓటీటీ
ఇక సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకునే ఓ యువకుడికి, అతని ధనిక తండ్రికి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంతో రూపుదిద్దుకున్న మలయాళ కామెడీ డ్రామా 'ప్రిన్స్ ఆఫ్ మోలీవుడ్'. ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో అలరిస్తోంది. ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ కూడా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


